Covid -19: కోవిడ్ 19 ఈ పేరు వింటేనే అందరికీ జలదరింపు వస్తుంది. 2020 -21వ సంవత్సరంలో కంటికి కనిపించని ఈ వైరస్ లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మహమ్మారి నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్న లోపే తిరిగి విజృంభిస్తుంది. తాజాగా దేశంలో పలు ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఏపీలో కరోనా కేసులు భారీగా పెరగటం గమనార్హం. జూన్ 26 తేదీ నుంచి ఏపీలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు సుమారు 13 కరోనా కేసులు పాజిటివ్ కావటం గమనార్హం.
ఇలా ఏపీలో కరోనా కేసులు అత్యధికంగా కడపలో నమోదు కావడం విశేషం. కడపలో 8 కేసులు నమోదు అవ్వగా,గుంటూరులో 3, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇలా ఉన్నపలంగా రాష్ట్రవ్యాప్తంగా 13 కరోనా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యి ప్రజలకు పలు హెచ్చరికలను జారీ చేసింది. ఈ కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారిలో నలుగురు మరణించారు అయితే ఈ మరణించిన నలుగురు గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇకపోతే కరోనా పాజిటివ్ వచ్చిన వారందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.
ఇలా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఏవైనా చిన్న లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తమయి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, వాసన కోల్పోవడం వాటి లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు పాటించాలని అలాగే బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి అని సూచించింది. ప్రస్తుతం కేసులు తక్కువగా ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.