Categories: DevotionalLatestNews

Varahi Ammavari Mudupu: వారాహి నవరాత్రులు.. అమ్మవారి ముడుపు ఎలా కట్టాలో తెలుసా?

Varahi Ammavari Mudupu: ఇటీవల కాలంలో వారాహి అమ్మవారి భక్తుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం వారాహి నవరాత్రులు నడుస్తున్న నేపథ్యంలో చాలామంది వారాహి వ్రతం ఆచరిస్తున్నారు. ఇలా వారాహి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇలా అమ్మవారి దీక్షలో తొమ్మిది రోజులపాటు ఈ వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకుంటారు. వారాహి దేవిని పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. మనలోని అహంకారం, భయం, కోరికలను అణచివేసి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది.జూలై 15 వ తేదీ ప్రారంభమైన ఈ నవరాత్రులు జూలై 23 వరకు జరుగుతాయి.

ఈ నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ప్రత్యేకంగా వ్రతం ఆచరించి అనంతరం అమ్మవారికి ముడుపు కట్టడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మరి వారాహి అమ్మ వారికి ఎలా ముడుపు కట్టాలి? ఏంటి అనే విషయానికి వస్తే..వారాహి అమ్మవారికి ముడుపు కట్టడం కోసం కొత్త ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రానికి నాలుగు వైపులా అలాగే మధ్యలో కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక అందులో తాంబూలం, అక్షింతలు, ఎరుపు రంగు పుష్పాలు, మన స్తోమత కొద్ది దక్షిణ, కొబ్బరికాయ ఉంచి మూడు ముడులు వేయాలి. ముడులు వేస్తున్న సమయంలో మనం కోరుకున్న కోరికను మనసులో అనుకుంటూ కోరిక నెరవేరాలని ప్రార్థించాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత ఈ ముడుపును అమ్మవారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయాలి.

How to tie varahi Ammavari Mudupu know details

Varahi Ammavari Mudupu: ఆలయానికి విరాళంగా ఇవ్వాలి..

ఇక అమ్మవారి పూజలో భాగంగా శనగలతో చేసిన వంటకాలు దద్దోజనం పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం హ్రం క్రీం ఐం వజ్ర వరాహి నమః అనే మంత్రాన్ని చదవాలి. మన కోరిక నెరవేరిన తర్వాత ముడుపు తీసి ఏదైనా ఆలయానికి విరాళంగా ఇవ్వాలి లేదంటే అమ్మవారి హుండీలో కానుకగా వేసేయాలి అనంతరం ముడుపులో కట్టిన కొబ్బరికాయను పగలకొట్టి ఆ కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి మొక్కు చెల్లించుకోవాలి.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

6 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

6 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.