Parenting Tips: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడ్డారు. ఫోన్ విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు . ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే తల్లులు కూడా స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారు. ఇలా బిడ్డలకు పాలిచ్చే తల్లులు స్మార్ట్ ఫోన్ కనుక ఉపయోగిస్తూ ఉన్నట్లయితే బిడ్డలు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి పాలిచ్చే సమయంలో తల్లులు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి దీనివల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా తల్లి బిడ్డకు పాలు ఇస్తుంది అంటే అది బిడ్డ ఆకలి తీర్చడం మాత్రమే కాదు. ఇలా బిడ్డ పాలు తాగే సమయంలో తల్లి బిడ్డ మధ్య మంచి అనుబంధాన్ని పెంపొందించే సమయం అని చెప్పాలి. పాలు తాగుతున్న సమయంలో శిశువు తల్లి ముఖాన్ని తల్లి కళ్ళను చాలా గమనిస్తుంది. అలాంటి సమయంలో తల్లి కూడా బిడ్డను చూస్తూ పాలు ఇవ్వటం వల్ల వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలా కాకుండా స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే లైటింగ్ బిడ్డ కంటి చూపు పై ప్రభావాన్ని చూపుతుంది.
పసిపిల్లల మెదడు చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది.ఈ సమయంలో తల్లి ముఖ కవళికలు, ఆమె మాట్లాడే మాటలు, నవ్వు, బిడ్డ మెదడులోని కణాలను ప్రేరేపిస్తాయి. తల్లి నిరంతరం ఫోన్ వైపు చూస్తూ ఉండిపోతే, బిడ్డ ఈ ప్రేరణలను కోల్పోతుంది. ఇది వారి మానసిక ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇకపోతే పాలు ఇచ్చే సమయంలో బిడ్డ కడుపు నిండిందా లేదా అనే విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తారు. తల్లి స్మార్ట్ ఫోన్లో నిమగ్నమై ఉంటే బిడ్డ సంకేతాలను గుర్తించడం కష్టమవుతుంది తద్వారా బిడ్డకు సరిపడా పాలు ఇవ్వకపోవడం లేదా అవసరానికి మించిన పాలు ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి . ఇలా తల్లి ఫోన్ చూస్తూ బిడ్డకు పాలు తాపించడం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలను బిడ్డలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక పిల్లల ఆరోగ్యం మానసిక శారీరక ఎదుగుదల కోసం తల్లులు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.