Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఆషాడం మాసం విశిష్టత కలిగి ఉన్నప్పటికీ కొన్ని పనులను చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఆషాడ మాసంలో ఎలాంటి పనులు చేయకూడదు?ఎలాంటి పనులు చేయాలి? ఆషాడ మాసం యొక్క విశిష్టత ఏంటి అనే విషయానికి వస్తే..జ్యేష్ఠ మాసం ముగిసిన వెంటనే అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడమాసం శుభకార్యాలకు సరైనది కాకపోయినప్పటికీ ఈ నెలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆషాడ మాసంలో జగన్నాథ రథయాత్ర, గురు పూర్ణిమ, దేవశయని ఏకాదశి వంటి అతి పెద్ద పండుగలు వస్తాయి.
ఇలా ఆషాడ మాసం ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ కొన్ని పనులకు పూర్తిగా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మరి ఆషాడమాసంలో ఎలాంటి పనులు చేయకూడదు అంటే.. ఎలాంటి పరిస్థితులలో కూడా నూతన గృహాలు, వివాహాలు చేయడం వంటి శుభకార్యాలు చేయటం మంచిది కాదు. అధర్మ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి పొరపాటున ఇతరులపై కోపతాపాలను చూపకూడదు. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం వారిపై నిందలు వేయట కూడా మంచిది కాదు. ఇక ఆషాడ మాసంలో వీలైనంతవరకు మాంసం మద్యం వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలనుకునేవారు ఈ నెలలో మొదలు పెట్టకపోవడం మంచిది.
ఇలా ఈ పనులకు ఆషాడ మాసం విశిష్టమైనది కాదు. వీలైనంతవరకు ఈ పనులకు దూరంగా ఉండటం మంచిది. ఇక ఆషాడ మాసంలో కొన్ని పనులను చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ముగించుకుని, రాగి పాత్రలో నీరు తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది ఆరోగ్యానికి, కీర్తి ప్రతిష్టలకు మేలు కలిగిస్తుంది. ఇక ఈ ఆషాడ మాసంలో మహావిష్ణువుని పూజించడం ఎంతో మంచిది. ప్రతిరోజు విష్ణు సహస్ర పారాయణం చేయటం లేదా వినటం వల్ల జాతక దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఆషాడ మాసంలో గొడుగులు, చెప్పులు, ఉప్పు, పండ్లు, గోధుమలను పేదలకు దానం చేయటం మరింత పుణ్యఫలాన్ని కలిగిస్తుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.