Conductor Jhansi : తన డాన్స్ మూమ్స్ తో బుల్లితెర పైన సందడి చేసి ప్రేక్షకులను అలరించాడు కొరియోగ్రాఫర్ చైతన్య. వారం వారం ప్రసారమయ్యే డాన్స్ ప్రోగ్రాం లో తనదైన ప్రత్యేకమైన టాలెంట్ తో పేరు సంపాదించుకున్నాడు. చూడ్డానికి బొద్దుగా ఉన్నా కొత్త కొత్త మూమెంట్స్ వేసే విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాడు చైతన్య. అయితే అప్పుల బాధలు తలలేక చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ వీడియో ను పోస్ట్ చేసి చనిపోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇండస్ట్రీని చైతు మరణం తీవ్ర విషాదంలో ముంచింది. చైతన్య మరణాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే తాజాగా చైతన్య మరణానికి సంబంధించి కండక్టర్ ఝాన్సీ సంచలన విషయాలు చేసింది. ఝాన్సీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చైతన్య అన్నయ్య ఇలా హఠాత్తుగాఎందుకు చనిపోయాడో అర్థంకావడం లేదని తెలిపింది. చైతన్య మాస్టర్ కు ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి పేమెంట్ రావాల్సి ఉందని కొంతమంది ఆర్టిస్టులు హ్యాండ్ ఇవ్వడంతో రూ. 7 లక్షల పేమెంట్ ఆగిపోయిందని ఆ భాద తోనే అన్నయ్య ఇలా చేసి ఉంటాడని ఝాన్సీ తెలియింది.

“చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి. ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప వ్యక్తిత్వం ఉంది . మాస్టర్ కు ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి పేమెంట్ రావాల్సి ఉంది. కొంతమంది హ్యాండ్ ఇవ్వడంతో రూ.7 లక్షల పేమెంట్ ఆగిపోయింది. ఆ ప్రోగ్రామ్ చేసిన ఆర్టిస్టులకు చైతన్య అన్నయ్యయ్యే అప్పు చేసి మరి పేమెంట్ ఇచ్చాడు. కళాకారులకు అన్యాయం జరగకూడదు అని అనుకునే వ్యక్తి చైతన్య. అందుకే పేమెంట్ సర్దడానికి అప్పు మీద అప్పు చేస్తూ వచ్చాడు .ఢీ షో నెక్స్ట్ సీజన్ లో అన్నయ్య కు చేసే అవకాశం వచ్చింది. కానీ ఇంతలోనే ఇలా జరిగింది” అని ఝాన్సీ ఎమోషనల్ అయ్యింది.
తన పరిస్థితి గురించి చెప్పి ఉంటే తోటి డ్యాన్సర్లు సహాయం చేసేవారని ఝాన్సీ తెలిపింది. కళాకారులు డబ్బులు ఇవ్వాలని వేధించేంత కఠినమైన వాళ్లు కాదని చెప్పింది.