Drinking water: సాధారణంగా మన శరీరానికి నీరు అవసరం ఎంతో ఉందనే విషయం మనకు తెలిసిందే. మన శరీరంలోని జీవక్రియలను సక్రమంగా జరగాలి అంటే శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే మన శరీరం హైడ్రేట్ గా ఉండి జీవక్రియలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. లేదంటే డిహైడ్రేషన్ భారిన పడి అవయవాలు పనితీరు కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక చాలా మంది తరచు నీటిని తాగుతూ ఉన్నామని చెబుతూ ఉంటారు అయితే మనం తాగిన నీరు మన శరీరానికి సరిపడాయా లేదా అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
మరి రోజు మనం నీటిని తాగుతూ ఉన్నప్పటికీ మన శరీరానికి నీరు సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఆ విషయం మన మూత్రం పై ఆధారపడి ఉంటుంది మనం తరచూ మూత్రానికి వెళ్ళినప్పుడు మూత్రం రంగును గుర్తించాలి.మన మూత్రం ముదురు పసుపు లేదా కాషాయం రంగులు నిర్జలీకరణాన్ని సూచిస్తాయి. లేత పసుపు లేదా గడ్డి రంగులు బాగా హైడ్రేట్ శరీరాన్ని సూచిస్తాయి. కాబట్టి మీరు సరైన హైడ్రేషన్ స్థాయిలను స్థిరంగా నిర్వహిస్తున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి రోజంతా మీ మూత్రం పై నిగా పెట్టడం అవసరం.
ఇక చాలామంది రోజులో కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగుతూ ఉంటారు. అలా తాగటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. అలా కాకుండా ప్రతి గంటకు ఒక గ్లాసు నీటిని తాగడం ఎంతో మంచిది ఇక మనం తరచూ మూత్రం వెళ్తున్నాము అంటే మన శరీరం హైడ్రేషన్ గా ఉందని మన శరీరానికి సరిపడా నీళ్లు మనం తాగుతున్నామని అర్థం అలా కాకుండా ఉదయం మూత్రానికి వెళ్లి సాయంత్రం వెళుతున్నారు అంటే కనుక మీరు సరిగ్గా నీళ్లు తాగలేదని అర్థం మీ శరీరానికి తగినంత నీరు అవసరమని సంకేతం.