Mon. Jul 14th, 2025

    Health Tips: సాధారణంగా చాలామందికి నిద్రలో కండరాలు పట్టేసినట్టు ఉంటాయి అంతేకాకుండా కాళ్లు కండరాలు మొత్తం తిమ్మిర్లు ఉంటాయి సరైన నిద్ర పట్టదు. ఇలా కండరాలు తిమ్మిరిగా ఉన్నట్లయితే గనుక మన శరీరంలో మార్పులు జరుగుతున్నాయని అర్థం. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇలా నిద్రలో కనుక కండరాలు పట్టేసినట్లు ఉంటే మన శరీరంలో లవణాలు తగ్గడం వల్ల, వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయట. శరీరంలో క్యాల్షియం వంటి లవణాల లోపం వల్ల కండరాల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.

    ఇలా రాత్రిపూట నిద్ర పట్టకుండా కాళ్లు తిమ్మిర్లు వస్తూ కనక ఉంటే వెంటనే ఈ పద్ధతులను కనుక పాటిస్తే వెంటనే ఈ నొప్పి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మన శరీరానికి లవణాలు ఎక్కువగా అందించాలి మనం ఆకుకూరలను అధికంగా తీసుకోవడం వల్ల ఆకుకూరలలో అత్యధికమైనటువంటి పోషక విలువలు ఉంటాయి. ఇలా ఆకుకూరలను పది రోజులపాటు క్రమంగా తీసుకోవడం వల్ల ఈ నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.

    ఆకుకూరలతో పాటు నువ్వులను కూడా అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నువ్వుల్లో మంచి పోషకాలు ఉంటాయి. అదే విధంగా మెండుగా క్యాల్షియం ఉంటుంది. దీంతో కండరాల తిమ్మిర్ల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా మంచి ఉపశమనం పొందుతారు. ఈ నీటిలో సోడియం ఎక్కువగా ఉండటంవల్ల కండరాల తిమ్మిరి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా సరైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూనే మరోవైపు వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.