Bhumika Chawla: భూమిక చావ్లా ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరేమో. ఈ బ్యూటీ గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది భూమిక. మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇలా దాదాపు అగ్రతారలందరితో జోడి కట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని న్యాచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది భూమిక. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పుడే ఫిట్నెస్ ట్రేైనర్ ను లవ్ మ్యారేజ్ చేసుకొని సినీ కెరీర్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టింది. పిల్లలు పుట్టాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు అగ్రతారల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది భూమిక. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఫాన్స్ ను అలరిస్తోంది. ఇటు సినిమాలు అటు ఫోటోషూట్లే కాదు ఈ భామ సరికొత్తగా ఓ బిజినెస్ స్టార్ట్ చేసిందట. అందుకు గోవాను పర్ఫెక్ట్ ప్లేస్ గా ఎంచుకుందట. మరి ఆ బిజినెస్ ఏంటి దాని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భూమిక మోడలింగ్ నుంచి తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పలు రకాల ప్రకటనలో నటించి దర్శకుల దృష్టిలో పడింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తేరే నామ్ మూవీ కి మొదట భూమిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . కానీ తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన యువకుడు సినిమాతో తెర ముందుకు వచ్చింది. అప్పట్లో యువకుడు సినిమా మంచి హిట్ సాధించడంతో భూమికాకు మంచి క్రేజ్ వచ్చింది. ఫస్ట్ మూవీ తోనే భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. భూమిక కెరీర్ లో ఒక్కడు, ఖుషి, సింహాద్రి సినిమాలు హిట్ లిస్టులో ఉంటాయి.
కెరీర్ పీక్స్ లో ఉండగానే భూమిక యోగా ట్రైనర్ భరత్ ఠాకూర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరిద్దరికీ ఓ బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కీ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. లేటెస్ట్ గా భూమిక గోవాలో బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. తన పర్సనల్ ఇంస్టాగ్రామ్ లో ఈ విషయాన్ని భూమికనే అనౌన్స్ చేసింది. గోవాలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలిపింది. అంతేకాదు ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. గోవాలోని మోర్జిమ్ లో సమర వెల్నెస్ అనే పేరుతో హోటల్ ని స్టార్ట్ చేసింది . ఈ ఫోటో లతో బీచ్ పక్కన ఈ హోటల్ ఉన్నట్లు తెలుస్తోంది . స్పా తో సహా అన్ని అత్యాధునికి సౌకర్యాలు అందిస్తున్నట్లు సమాచారం.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.