Thu. Jul 10th, 2025

    Bhumika Chawla: భూమిక చావ్లా ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరేమో. ఈ బ్యూటీ గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది భూమిక. మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇలా దాదాపు అగ్రతారలందరితో జోడి కట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని న్యాచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది భూమిక. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పుడే ఫిట్నెస్ ట్రేైనర్ ను లవ్ మ్యారేజ్ చేసుకొని సినీ కెరీర్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టింది. పిల్లలు పుట్టాక మళ్ళీ  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు అగ్రతారల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది భూమిక. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్ పిక్స్ ను  షేర్ చేస్తూ ఫాన్స్ ను అలరిస్తోంది.  ఇటు సినిమాలు అటు ఫోటోషూట్లే కాదు ఈ భామ సరికొత్తగా ఓ బిజినెస్ స్టార్ట్ చేసిందట. అందుకు గోవాను పర్ఫెక్ట్  ప్లేస్ గా ఎంచుకుందట. మరి ఆ బిజినెస్ ఏంటి దాని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    bhumika-chawla-started-a-new-business-in-goa
    bhumika-chawla-started-a-new-business-in-goa

    భూమిక మోడలింగ్ నుంచి తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పలు రకాల ప్రకటనలో నటించి దర్శకుల దృష్టిలో పడింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తేరే నామ్ మూవీ కి మొదట భూమిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . కానీ తెలుగులో  సుమంత్ హీరోగా వచ్చిన  యువకుడు సినిమాతో తెర ముందుకు వచ్చింది.  అప్పట్లో యువకుడు సినిమా మంచి హిట్ సాధించడంతో భూమికాకు మంచి క్రేజ్ వచ్చింది.  ఫస్ట్ మూవీ తోనే భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.  భూమిక కెరీర్ లో ఒక్కడు, ఖుషి, సింహాద్రి సినిమాలు హిట్ లిస్టులో ఉంటాయి.

    bhumika-chawla-started-a-new-business-in-goa
    bhumika-chawla-started-a-new-business-in-goa

    కెరీర్ పీక్స్ లో ఉండగానే భూమిక  యోగా ట్రైనర్  భరత్ ఠాకూర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరిద్దరికీ ఓ బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. తెలుగు,  తమిళ్, హిందీ  భాషలలో కీ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. లేటెస్ట్ గా భూమిక  గోవాలో బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.  తన పర్సనల్ ఇంస్టాగ్రామ్ లో  ఈ విషయాన్ని భూమికనే అనౌన్స్ చేసింది. గోవాలో  హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలిపింది. అంతేకాదు ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. గోవాలోని మోర్జిమ్ లో సమర వెల్నెస్ అనే పేరుతో హోటల్ ని స్టార్ట్ చేసింది . ఈ ఫోటో లతో బీచ్ పక్కన ఈ హోటల్ ఉన్నట్లు తెలుస్తోంది .  స్పా తో సహా అన్ని అత్యాధునికి సౌకర్యాలు అందిస్తున్నట్లు సమాచారం.