Tollywood: ప్రస్తుతం అంతటా సలార్ ఫీవర్ తో హీటెక్కి ఉన్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన నంబర్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇంకా కొనంచోట్ల బ్రేకీవెన్ కి కాస్త దూరంలో ఉంది సలార్. శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించిన సలార్ 2023 లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
హోంబలే సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా పార్ట్ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా 1000 కోట్లు మార్క్ మాత్రం దాటడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ లాంటి సినిమాకే ఇలా ఉంటే ఇక పుష్ప సీక్వెల్ బిజినెస్ పరిస్థితేంటీ..? అని ఇప్పుడు కొత్తగా టాక్ వినిపిస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేసిన పుష్ప 1 ఊహించినదానికంటే ఎక్కువ సక్సెస్ సాధించింది.
కానీ, ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ అలాగే, జవాన్, పఠాన్ లాంటి సినిమాలు వసూళ్ళ పరంగా మాజిక్ చేశాయి. వాటితో పోల్చుకుంటే సలార్ తక్కువే. దాంతో మైత్రీ వారు ఆశించిన వసూళ్ళు పుష్ప 2 సాధిస్తుందా..? అనేది ఇప్పుడు మినియన్ డాలర్స్ క్వశ్చన్ గా మారింది. దాదాపు రూ 300 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్న నిర్మాతలు. దాంతో కేవలం నాన్ థీయాట్రికల్ రైట్స్ కాకుండానే 200 కోట్ల బిజినెస్ ని పుష్ప 2 మీద నిర్మాతలు ఆశిస్తున్నారు.
గత కొంతకాలంగా డిస్ట్రిబ్యూటర్స్ ఒక సినిమా కొనేముందు చాలా లెక్కలు వేసుకొని కొంటున్నారు. ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందీ..? అని ఓ క్లారిటీకి వచ్చాకే ముందుకు వస్తున్నారు. ఈ లెక్కల ప్రకారమే పుష్ప 2 మూవీ 160 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో 50 నుంచి 60 కోట్ల వరకూ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. కానీ, మైత్రీవారు మాత్రం 100 కోట్ల వరకు ఆశిస్తున్నారు. మరి ఆ రేంజ్ లో బన్నీ రాబడతాడా లేదా చూడాలి. మొత్తానికి సలార్ లెక్కల ప్రభావం మాత్రం ఇకపై రానున్న సినిమాలపై బాగానే చూపుతోంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.