Categories: EntertainmentLatest

Bhoomika Chawla : వన్నె తరగని అందాలతో మత్తెక్కిస్తోన్న సీనియర్ బ్యూటీ..సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గేదేలేదంటూ అందాల ప్రదర్శన

Bhoomika Chawla : ఖుషీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సరసన నటించి అందరి దిల్ ఖుష్ చేసింది అలనాటి అందాల తార భూమికా చావ్లా . అప్పట్లో మేకప్ లేకుండానే తొలి మూవీలో సహజ సిద్ధమైన అందాలతో నటించి కుర్రాళ్ల హృదయాల్లో చోటు దక్కించుకుంది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అనే పాట వినిగానే ముందుగా భూమిక గుర్తొస్తుందంటే ఆమె బ్యూటీకి అప్పట్లో ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖుషీ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలకొట్టడంతో ఈ ఢిల్లీ బ్యూటీకి అవకాశాలు క్యూలైన్ కట్టాయి. అమ్మడి కాల్‌షీట్లకోసం డైరెక్టర్లు ఎగబడ్డారనే చెప్పాలి. అందంతో పాటు అమ్మడి నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది ఒకప్పటి మాట కాదు ఇప్పుడు కూడా ఈ భామకు ఏమాత్రం అందం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. లేటు వయసులోనూ తన ఘాటు అందాలతో మ్యాజిక్ చేస్తోంది భూమిక. తాజాగా ఈ బ్యూటీ తన త్రో బ్యాక్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మెస్మరైజ్ చేస్తోంది.

bhoomika-chawla-glamours-looks-in-amazing-black-out-fit

ఓ మోడల్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది భూమిక. అనంతరం అవకాశాలు దక్కడంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. తెలుగులో ఎంట్రీ ఇచ్చింది యువకుడు చిత్రంతో అయినా ఖుషి మూవీతో స్టార్డమ్ ను దక్కించుకుంది. ఆ తరువాత స్నేహమంటే ఇదేరా, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి, సాంబ, నా ఆటోగ్రాఫ్‌, జై చిరంజీవ, మాజాబజార్, అనసూయ వంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

bhoomika-chawla-glamours-looks-in-amazing-black-out-fit

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఫిట్‌నెస్ ట్రైనర్ భరత్‌ను పెళ్లి చేసుకుంది భూమిక. పెళ్లైన తరువాత కూడా తన కెరీర్ ను కంటిన్యూ చేసింది. అప్పట్లో వచ్చిన అవకాశాలన్నింటిని ఉపయోగించుకుంది. మళ్లీ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మంచి జోష్‌లో సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది ఈ భామ. సెకెండ్ ఇన్నింగ్స్‌నోలూ తన అందాలతో దాడి చేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది భూమిక.

bhoomika-chawla-glamours-looks-in-amazing-black-out-fit

నానితో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి, సమంత సినిమా యూ టర్న్, రూలర్, ఇదే మా కథ, సీటీమార్, సీతారామమ్, బటర్‌ఫ్లై వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సినిమాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది భూమి. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేస్తూ తన అందం ఇప్పటికీ అలాగే ఉందని మరోసారి గుర్తుచేస్తుంటుంది.

bhoomika-chawla-glamours-looks-in-amazing-black-out-fit
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.