Categories: EntertainmentLatest

Priyanka Mohana : సమ్మోహన పరుస్తున్న మోహన అందాలు…అవకాశాల కోసమే హద్దు దాటుతోందంటున్న నెటిజన్లు

Priyanka Mohana : అందం ఉంటే సరిపోదు అందుకు తగ్గట్లుగా అదృష్టం కూడా ఉండాలి. అదిలేకే పాపం తమిళ కుట్టీ ప్రియాంక మోహన్‌ తెలుగు ఇండస్ట్రీలో రాణించలేకపోయింది. నానితో గ్యాంగ్‌లీడర్, శర్వాతో శ్రీకారం సినిమాలు చేసినా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్‌టాక్‌ను సొంతం చేసుకోకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో తన అదృష్టాన్ని చెన్నైలో పరిక్షీంచుకుంటోంది ఈ బ్యూటీ. డాక్టర్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అక్కడ మంచి అవకాశాలనే అందిపుచ్చుకుంటోంది. అమ్మడి అదృష్టం సొంతనేలపై బాగానే ఉందని చెప్పాలి గత ఏడాది సూర్యతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈటి సినిమాలో తన యాక్టింగ్‌తో అందంతో తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ బ్యూటీ.

priyanka-mohana-stunning-photo-shoot

ప్రియాంక సొంతూరు తమిళనాడు. చైన్నైలోనే స్టడీస్ పూర్తి చేసింది. థయేటర్ ఆర్ట్స్ తో డిగ్రీ చేసిన ప్రియాంక సినిమాలవైపు మొగ్గు చూపింది. మొదటి ప్రయత్నంగా మలయాళ చిత్రంలో కనిపించింది అయితే అక్కడి ఈ మూవీకి ఆదరణ రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి వలస వచ్చింది. ఇక్కడ కూడా బెడిసికొట్టడంతో ఇఫ్పుడు తమిళంలో సెటిల్ అయ్యింది. అయితే తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తన అందాల ఫోటోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది. తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్లు గ్లామర్ గా కనిపించని ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన అందాలు హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసమే ఈ చిన్నది ఇలా చేస్తోందని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

priyanka-mohana-stunning-photo-shoot

గ్లామర్ తో పాటు లక్ ఉన్న హీరోయిన్స్‌కే ఏ ఇండస్ట్రీలో అయినా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అయితే ఈ విషయంలో ప్రియాంక మాత్రం కాస్త వెనుకబడిందనే చెప్పాలి. ఈ అమ్మడికి అందం, అభినయం ఉన్నా అందుకు తగ్గ అదృష్టం లేదు.

priyanka-mohana-stunning-photo-shoot

అయితే అలా అని సైలెంట్ అయిపోలేదు. పోగొట్టుకున్న దగ్గరే రాణించాలనుకుంటోంది ఈ చిన్నది అందుకే అన్ని ఇండస్ట్రీల్లోనూ తన టాలెంట్‌ ప్రూవ్ చేసుకునే పనిలో పడింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ బ్యూటీకీ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ఉపయోగించుకుని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ తో అయినా టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్లల్లో పడాలనుకుంది కాబోలు బ్యాక్ లెస్ టాప్ వేసుకుని ఉల్లిపొరలాంటి స్కర్ట్ ధరించి తన అందాలను చూపించి చూపించకుండా హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఈ కట్ అవుట్ డ్రెస్‌ లో ప్రియాంక కత్తిలా ఉంది. సింపుల్ మేకప్ లో స్టన్నింగ్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

priyanka-mohana-stunning-photo-shoot
Sri Aruna Sri

Recent Posts

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

19 hours ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

19 hours ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

2 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

2 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

Ashada Masam: ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తున్నారా? అస్సలు చేయొద్దు..

Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…

3 days ago

This website uses cookies.