Health – Neem Leaves: మారిన కాలానుగుణంగా ఎక్కువశాతం ప్రజలు రక రకాల టూత్ పేస్ట్, పౌడర్‌లను ఉదయం లేవగానే పళ్ళు తోమడానికి ఉపయోగిస్తు న్నారు. కానీ, పూర్వ కాలంలో వేప కొమ్మల నుంచి చిన్న చిన్న పుల్లలను విరిచి ఆ పుల్లలతో పళ్ళు తోముకునేవారు. పల్లెటూర్లలో ఇప్పటికీ ముఖం కడుక్కోవడాని కి వేప పుల్లలనే ఉపయోగిస్తున్నారు. వేప పుల్లతో పళ్ళు తోమడం వల్ల నోట్లో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా నశించిపోతుంది. అంతేకాదు, కొందరు పుచ్చి పళ్ళతో బాధ పడుతుంటారు. అలాంటి వారు వేప పుల్లతో పళ్ళు తోముకుంటే ఆ నొప్పి నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. వేపలోని చేదుతనం శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
ఇక అమ్మవారు పోసిన వారికి వేప ఆకు చిగురును, లేత ఆకులను తీసుకొని పసుపు నువ్వుల నూనె కలిసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకొని ఒళ్లంతా పట్టించి కాసేపు అయ్యాక స్నానం చేస్తే శరీరానికి హాయిగా ఉంటుంది. ఒంటిమీద ఉన్న క్రిములు, బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాదు వేప ఆకులను నీళ్ళలో వేసి బాగా మరిగిన తర్వాత ఆకులను తీసేసి ఆ నీటితో తల స్నానం చేయడం చాలా మంచిది. వేప ఆకులోని ఔషధ గుణాలు శరీరంపై ఉన్న మలినాలను పూర్తిగా తొలగిస్తాయి.
Health – Neem Leaves: చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చును.
ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలకు వేపాకు వేసి మరగబెట్టిన నీటితో స్నానం చేయిస్తారు. దీని వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అలాగే, చర్మ వ్యాదులను, బ్యాక్టీరియా వల్ల ఒంటిపై వచ్చే దురదలను, దద్దుర్లను వేపాకుతో పసుపు మిశ్రమాన్ని ఒళ్ళంతా రాసుకుని స్నానం చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక అమ్మాయిలలో కొందరికి చుండ్రు సమస్య ఉంటుంది. అలాంటి వారు కొద్దిగా వేపాకులను తీసుకొని మెత్తగా రుబ్బుకొని దానికి రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తల వెంట్రుకలకు బాగా పట్టించాలి. పది, పదిహేను నిముషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చును.
అలాగే, లేత వేప ఆకులను మెత్తగా రుబ్బి..చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మిగతా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, తగ్గుతుంది. బీపీ, షుగర్ సమస్యలున్న వారు రోజూ ఉదయం గనక ఈ వేప ఆకులతో చేసిన ఉండలను తింటే బీపీ, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతేకాదు, హార్ట్ ఎటాక్ రాకుండా కూడా వేపాకు కాపాడుతుంది. వేప ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని పొడిగా ఉన్న డబ్బాలో భద్రపరుచుకొని రోజూ నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల కూడా చాలా రోగాల నుంచి కాపాడుకోవచ్చు.
గమనిక: పైన చెప్పిన విషయాన్నీ ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు తెలపబడినవి.