Andhra Pradesh: పాలిటిక్స్‌లోకి బాలయ్య చిన్న కూతురు.. పోటీ అక్క‌డి నుంచే..?

Andhra Pradesh: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? నందమూరి తారకరామారావు లెగసీని, నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను పుణికిపుచ్చుకుని ఆ కుటుంబం నుంచి ఒక లేడీ లీడర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే ప్ర‌చారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బాలయ్య చిన్న కుమార్తె, విశాఖ ఎంపీ శ్రీ భరత్ సతీమణి నందమూరి తేజస్విని 2029 ఎన్నికల బరిలో నిలవడం ఖాయమనే వార్త‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా, ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం భీమిలీ. ఒకప్పుడు కేవలం ప్రశాంతమైన బీచ్ ప్రాంతంగా ఉన్న భీమిలీ, ఇప్పుడు రూపురేఖలు మార్చుకుని ఐటీ హబ్‌గా, విలాసవంతమైన రిసార్టులు, గూగుల్ డేటా సెంటర్ వంటి గ్లోబల్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ తరహాలో డెవలప్ అవుతున్న ఈ నియోజకవర్గంపై ఇప్పుడు అన్ని పార్టీల నేతల కన్ను పడింది. టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న ఈ స్వీట్ సీట్ నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడకే అనే నమ్మకం ఉండటంతో, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు భారీ పోటీ నెలకొంది.

balakrishna-daughter-tejaswini-nandamuri-political-entry-in-2029

Andhra Pradesh: భీమిలీ స్థానం నుంచి నందమూరి తేజస్విని బరిలోకి దించాలనే ఆలోచన

ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికల వ్యూహాల్లో భాగంగా భీమిలీ స్థానం నుంచి నందమూరి తేజస్విని బరిలోకి దించాలనే ఆలోచనలో కూటమి పెద్దలు ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె భర్త శ్రీ భరత్ విశాఖపట్నం ఎంపీగా భారీ మెజారిటీతో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన పార్లమెంట్ పరిధిలోనే ఉండే భీమిలీ అసెంబ్లీ స్థానం నుంచి భార్య తేజస్వినిని బరిలోకి దించితే, అటు నందమూరి ఇమేజ్, ఇటు లోకల్ గ్రిప్ రెండూ కలిసి వస్తాయని భరత్ భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే తెరవెనుక ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే భీమిలీ సీటు సాధించడం తేజస్వినికి అంత సులువు కాదనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిని ఇక్కడి నుంచే లాంచ్ చేయాలని చూస్తున్నారు. మరోవైపు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరి భీమిలీ టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. వీటికి తోడు జనసేన పార్టీ కూడా ఈ సీటుపై గట్టి పట్టుదలతో ఉంది. ఇంతమంది సీనియర్లు, ఆశావహులు రేసులో ఉన్నప్పటికీ.. ఒకవేళ బాలయ్య కుమార్తెగా తేజస్విని గనుక రంగంలోకి దిగితే సమీకరణాలన్నీ తలకిందులు కావడం ఖాయం.

పైగా భీమిలీ నియోజకవర్గానికి నందమూరి కుటుంబానికి ఒక విచిత్రమైన సెంటిమెంట్ లింక్ ఉంది. గతంలో 1994 ఎన్నికల సమయంలో స్వయంగా అన్న నందమూరి తారకరామారావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించి, చివరి నిమిషంలో టెక్కలికి మారారు. ఆ తర్వాత 2019లో నారా లోకేష్ భీమిలీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. మరి అప్పట్లో తాత, బావలకు సాధ్యం కాని భీమిలీ ఎంట్రీని.. ఇప్పుడు బాలయ్య కుమార్తె తేజస్విని నిజం చేసి చూపిస్తారా? ఆమెకు అసలు రాజకీయాలపై ఆసక్తి ఉందా? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.