Categories: DevotionalLatestNews

Tirumala: వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ… వెయ్యి మందికి ఫ్రీ దర్శనం..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇప్పటికే టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సరైన వసతులను ఏర్పాటు చేస్తోంది. అయితే తాజాగా స్వామివారి దర్శన విషయంలో వయోవృద్ధులకు టీటీడీ శుభవార్తను తెలియజేసింది. ప్రతిరోజు 1000 మంది వృద్దులకు దివ్యాంగులకు ఉచిత దర్శనం కల్పించబోతున్నట్లు టిటిడి తెలియజేసింది. ఇలా ఫ్రీగా దర్శనం చేసుకోవడం కోసం మూడు నెలలు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలియచేసింది.

ఆన్లైన్ ద్వారా మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకుని వెసులుబాటును కల్పిస్తుంది. తిరుమలలోని నంబి ఆలయం వద్ద సీనియర్ సిటిజన్ల ప్రత్యేక దర్శనం క్యూలైన్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ దర్శనం కోసం ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి 50 రూపాయల లడ్డు కూడా ఉచితంగా అందించబోతున్నట్లు తెలిపారు.

TTD issues key  update on tirumala senior citizen darshan know details

Tirumala: వృద్ధులకు టీటీడీ శుభవార్త..

వయోవృద్ధులు దర్శనం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను మోసాలను నమ్మొద్దు అంటూ టీటీడీ కీలక సూచనలు చేయడమే కాకుండా ఈ దర్శనం కోసం వయోవృద్ధులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org,https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించాలని సూచించింది. సోషల్ మీడియాలో ఎవరైనా ఈ దర్శనాల పట్ల మోసాలకు పాల్పడితే వెంటనే టీటీడీ హెల్ప్‌లైన్ నెంబర్ 155257కు కాల్ చేయాలని భక్తులకు సూచనలు చేశారు. ఇలా ఉచిత దర్శనం ద్వారా ఎంతో మంది వృద్ధులు దివ్యాంగులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే వెసులుబాటును తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించడంతో భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.