Ashu Reddy : సినీతారల , సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, వారితో ప్రత్యేక పూజలు చేయిస్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి. నాగచైతన్య, సమంత విడిపోతారని, ప్రభాస్ హెల్త్ బాగోలేదని, ఆయన నటించిన సినిమాలు హిట్ కావని వారి జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అయినా వాటిని లెక్క చేయకుండా తన పని చేసుకుని వెళ్తున్నారు వేణు స్వామి.
తాజాగా ఈ స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటివరకూ వేణు స్వామి టాలీవుడ్ యాక్ట్రెస్ రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి తారలతో ప్రత్యేక పూజలు చేయించారు. ఇటీవలే బిగ్ బాస్ ఫేమ్ బ్యూటీ ఇనయా సుల్తానా ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంది. తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఇంట్లో కూడా వేణు స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను అషు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. వేణుస్వామి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎవరి నమ్మకాలు వాళ్లవి బ్రో అని హ్యాష్ ట్యాగ్ జోడించి ఈ వీడియో ను షేర్ చేసింది.
అషూ రెడ్డి ఇంట్లో వేణు స్వామి పూజలు చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. దీనితో అలెర్ట్ అయిన అషు ఆ వీడియోకి కామెంట్ సెక్షన్ ను డిసెబుల్ చేసింది. అయితే వేణు స్వామితో పూజలు చేయించడం అషు కి ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కొత్త కారు కొన్నప్పుడు ఇదేవిధంగా ఈ పూజలు చేయించింది. మళ్లీ ఇప్పుడు ఇలా చేయడంతో నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.