Tue. Jul 8th, 2025

    Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ కొద్ద కాలంలోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. పొట్టి పొట్టి దుస్తులు ధరించి హాట్ హాట్ డ్యాన్సులతో తెరముందు కనిపించి బుల్లితెరలోనూ హీట్ పెంచింది. అనసూయ వచ్చిన తర్వాత టెలివిజన్ లుక్కే మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. అప్పటి వరకు నిండు బట్టలతో కనిపించిన యాంకర్లందరూ అనసూయను ఫాలో అయ్యారు. దీంతో అనసూయనకు ఇండస్ట్రీలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. పలు స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక నెట్టింట్లో తన అభిప్రాయాలను పంచుకుంటూ వివాదాస్పద పోస్టులు పెడుతూ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనసూయ. అంతేకాదు అప్పుడప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రోల్స్ కి గురవుతుంది. అయినా అనసూయ ఏమాత్రం లెక్కచేయకుండా వీలు కుదిరినప్పుడల్లా తన అందాల దాడితో దుమ్మురేపుతుంది. ఇక రీసెంట్ అనసూయ ఓ ఇంటర్వ్యూలో తన దుస్తుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను పొట్టి బట్టలు వేసుకోవడం నా కొడుకుకు ఇష్టం ఉండదని చెప్పి తెలిపింది. దీని గురించి వారి మధ్య జరిగిన సంభాషణను తెలిపింది.

    Anasuya : my son did not like my dressing anchor shocking comments 
    Anasuya : my son did not like my dressing anchor shocking comments 

    ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ..” ఓసారి మమ్మీ అంత పొట్టి డ్రెస్ ఎందుకు కాస్త పెద్దది వేసుకోవచ్చు కదా అని నా పెద్ద కొడుకు డైరెక్ట్ గా నన్ను అడిగాడు. దానికి నేను సీరియస్ గా రికార్ట్ కాలేదు. తనకు అర్థమైయ్యేలా వివరించాను. నా బట్టలు నా ఇష్టం. నాకు నచ్చినట్లు నేను ఉంటాను. నువ్వు వేసుకునే అవెంజర్స్ టీ షర్ట్ కూడా నాకు నచ్చదు. అందుకని దానిని నువ్వు వేసుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు కదా. ఎందుకంటే అది నీకు ఇష్టం కాబట్టి సరేనన్నాను. నా విషయంలో కూడా అంతే. ఎప్పుడూ నాకు నచ్చిన బట్టలే నేను వేసుకుంటాను. నేను చదువుకునేప్పుడు మా అమ్మ చెప్పిన బట్టలే వేసుకునేదాన్ని. కానీ వారిని నేను ఎప్పుడూ తప్పు పట్టలేదు. నిజానికి నా పేరెంట్స్ వల్లే నాకు ఫ్యామిలీ అంటే ఏంటో అర్థమైంది అని చెప్పాను”అని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

    Anasuya : my son did not like my dressing anchor shocking comments 
    Anasuya : my son did not like my dressing anchor shocking comments