Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. బుల్లితెరపైన అప్పటి వరకు ఏ యాంకర్ చేయడని విధంగా ఘాటు ఎక్స్పోజింగ్ తో టీవీ షోల రూపాన్నే మార్చేసింది అనసూయ. పెళ్లై, ఇద్దరు కొడుకులకు తల్లైనా కూడా అందాల ఆరబోతలో ఈ బ్యూటీ ఎలాంటి మద్దులను పెట్టుకోలేదనే చెప్పాలి. అదే పాపులారిటీతో వెండితెరపైన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

అందాల దాడితోనే కాదు నటనతోనే అందరిని కట్టిపడేసింది. ఓవైపు టీవీలో స్పెషల్ షోలు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనదైన మార్క్‌ను సెట్ చేస్తూ కెరీర్లో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ అనసూయ చేసే రచ్చ మామూలుగా ఉండది. ఈ భామ గురించి ఎప్పుడూ నెట్టింట్లో ఏదో ఒక హాట్ టాపిక్ నాడుస్తూనే ఉంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా తన బోల్డ్ చిత్రాలను పోస్ట్ చేసి రచ్ రచ్చ చేస్తోంది. నెట్టింట్లో మంటలు రేపుతోంది.

అనసూయ ప్రస్తుతం షూటింగ్ లకు బ్రేక్ చెప్పి ఫ్యామిలీతో బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. భర్తతో పాటు పిల్లలతో థాయిలాండ్ కు వెకేషన్ నిమిత్తం వెళ్లిన ఈ హాట్ బాంబ్ వరుసగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుపు రంగు బికినీలో దిగిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. గత రెండు మూడు రోజులుగా రకరకాల ఫోటోలను షేర్ చేసి అనసూయ, ఈ రోజు మాత్రం కాకరేపింది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. టూ పీస్ బికినీలో దిగిన బోల్డ్ ఫోటో షూట్ తో బీచ్ లో రచ్చ రచ్చ చేస్తోంది రంగమ్మత్త. ఈ ఫోటోల్లో గ్లామర్ డోస్ మరింత పెంచేంసింది అనసూయ. ఆ అందాలు చూస్తూ నెటిజన్ల మతులు పోతున్నాయి.

అందాల ఆరబోతలో అనసూయ ముందు వరుసలోనే ఉంటుంది. నిజానికి ఇదే ఆమెకు క్రేజ్ తీసుకువచ్చింది. బుల్లితెరపైన ఓ రేంజ్ లో పొట్టి పొట్టి దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన అనసూయ సినిమాల్లో కాస్త పద్ధతిగానే కనిపించింది. కానీ వీటికి అతీతంగా తన పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో మాత్రం అందాలతో దాడి చేస్తోంది. తనను ఆంటీ అంటూ.. పిచ్చిపిచ్చి కామెంట్స్ చేసి నెటిజన్లకు ఈ బికినీల అందాలు చూపిస్తూ గట్టి సమాధానమిస్తోంది అనసూయ.

ఈ మధ్యే నెట్టింట్లో బికినీ ఫొటోలతో కవ్వించిన అనసూయ. మరోసారి ఆ ఫోటోలతో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. థాయిలాండ్ బీచ్‌లో తెలుపు రంగు బికినీతో దిగిన ఫొటోలను తాజాగా పోస్ట్ చేసింది. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. పెళ్లి రోజు సందర్భంగా బీచ్ లో భర్తతో కలసి లిప్ లాక్ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

తాజాగా సింగిల్ గా హాట్ యాంగిల్స్ లో దిగిన ఫోటోలను పంచుకుని తనలోని అందాలను మరోసారి అందరికీ చూపించింది. అయితే ఈ ఫోటోలు తీసిన క్రెడిట్ అంతా కూడా తన కొడుకు సుశాంక్ భరద్వాజ్ కే చెందుతుందట. ఎందుకంటే అనసూయను ఇంత హాట్ గా చూపించింది ఆయనక కోడుకేనట. అందుకే ఆ క్షణాలను మరిచిపోలేకపోతున్నాను అంటూ మరోసారి ఈ పిక్స్ ను పంచుకుంది.

