Anand Devarakonda : దేవరకొండ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు హీరోలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డి మూవీతో రికార్డులు కొల్లగొట్టి తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో యాత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ.ఈ మధ్యనే ట్రయాంగల్ లవ్ స్టోరీ బేబీ మూవీతో బ్లాక్ బ్లాస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు ఆనంద్. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం సైన్ చేశాడు. ఈ క్రమంలో ఈ యంగ్ హీరో ఓ ఇంటర్వ్యూ లో తన బ్రేక్ అప్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ ఫెయిల్యూర్ గురించి భావోద్వేగమయ్యాడు ఆనంద్.. ” నేను ఓ అమ్మాయిని లవ్ చేశాను. ఆమె తన హయ్యర్ స్టడీస్ కోసం షికాగో వెళ్ళింది. నేను కూడా వెళ్లాలని అనుకున్నాను. అక్కడే ఇద్దరం కలిసి ఉండొచ్చని అనుకున్న. అందుకోసం షికాగోలోని టాప్-5 ఇంజినీరింగ్ కాలేజీలకు అప్లై చేసుకున్నాను. నాకు ఓ కాలేజ్ లో సీటు కూడా వచ్చింది.చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. కానీ తిరా అక్కడికి వెళ్లాక కథ అడ్డం తిరిగింది. ఆమెతో నాకు బ్రేకప్ అయ్యింది. చాలా ఫీల్ అయ్యాను. నా గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ బ్రేకప్ నుంచి బయటపడేందుకు ఐదేళ్లు పట్టింది. నేను సిన్సియర్ గా లవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది.” అని చాలా ఫీల్ అవుతూ చెప్పాడు ఆనంద్ దేవరకొండ.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో బేబీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. తమిళ డైరెక్టర్ క్రిష్ మిథున్ దర్శకత్వంలో ఆనంద్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ హీరోయిన్ రితికా నాయక్ ఆనంద్ కు జోడీగా కనిపించునుంది.