Health Tips: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఇలా తరచూ అనారోగ్య సమస్యలకు గురవటానికి మన జీవన శైలి కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం వల్ల ఇలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లు నిండకుండానే ఎంతో మంది మోకాళ్ళ నొప్పులతో, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే మునగాకుతో ఈ నొప్పులన్నిటికీ చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా వయసు పైబడిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మొదలవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి.కీళ్ల దగ్గర తగినంత జిగురు లాంటి పదార్థం ఉండకపో వడమే ఇందుకు ప్రధాప్రధాన కారణం . అయితే వీటి నుండి విముక్తి పొందటానికి రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మనం అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు . ముఖ్యంగా మునగాకు మునగ కాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. ఆకులే కాదు వాటి పువ్వ ల్లో కూడా మంచి ఔషధ గుణాలు కలిగి వున్నాయ.
మునగను ఆయుర్వేదంలో అమృతంలా పరిగణిస్తారు . ఎందు కంటే మునగ 300 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో అమృతంలా భావిస్తారు. మునగ ఆకు, కాయలు, పువ్వులో యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మునగలో కాల్షియం , పొటాషియం , జింక్, మెగ్నీ షియం , ఐరన్, కాపర్, ఫాస్ప రస్ వంటి అనేక పోషక ఖనిజాలు ఉన్నాయి. ఇది మన శరీరంలో ఎముకలో కండరాల దృఢంగా ఉండేలా. మునగాకుతో చేసిన వంటకాలు తినటం వల్ల ఎముక లోపల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.