Allu Sneha Reddy : పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఆగస్టు లో మరోసారి తన తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఓ వైపు ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీకి ప్రయారిటి ఇస్తాడు అల్లు అర్జున్. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా భార్యా పిల్లలతో విలువైన సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటాడు. మంచి ఫ్యామిలీ మెన్ గా కూడా బన్నీకి ఇండస్ట్రీలో పేరుంది. ఇక తన బెటర్ హాఫ్ అల్లు స్నేహ గురించి ప్రత్యేక కేర్ తీసుకుంటాడు బన్నీ. ఆ ఇష్టాలకు ఎప్పుడు సపోర్టివ్ గా నిలుస్తుంటాడు. తాజాగా అల్లు స్నేహ గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆమె అందం, స్టైల్ ని చూసి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమోనని అందరూ భావించారు. అయితే మొదటిసారి అల్లు స్నేహ ఓ యాడ్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

స్నేహారెడ్డి సినిమా విషయాలకు దూరంగా ఉంటుంది. ఇండస్ట్రీ తో పెద్ద టచ్ లేకపోయినప్పటికీ హీరోయిన్ లకు మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. హీరోయిన్లకు మించిన అందం స్నేహ సొంతం కావడంతో,అప్పుడప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి క్రేజీ ఫోటోషూట్ చేస్తుంటుంది. ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. అలాగే బన్నీ, పిల్లలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది స్నేహారెడ్డి. ఈ క్రమంలో అలు స్నేహ నటించిన యాడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో సూపర్ అంటూ మెగా వారి కోడలు లావణ్య త్రిపాఠి కామెంట్ కూడా చేసింది.

అల్లు స్నేహ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే స్నేహ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నారు. స్నేహ కిండర్ బ్రాండ్ కి నటించింది. కిండర్ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తోంది. ఇందులో స్నేహ నేచురల్ లుక్ లో మెరిసింది. అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇకపోతే ఈ యాడ్ షూట్ లో ఒక బాబు కనిపిస్తాడు అయితే ఆ బాబు ప్లేస్ లో అయాన్ లేదా అర్హ ఉంటే బాగుండేదాని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు స్నేహ హీరోయిన్ లా ఉందని, టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతుందని చెప్తున్నారు.