Tue. Jan 20th, 2026

    Allu Arjun Arrest: ‘పుష్ప 2’ చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు.

    ‘పుష్ప 1’ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప 2’ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన భారీగా విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందు అనగా డిసెంబర్ 4న 9.30 నిముషాలకి బెనిఫిట్ షోలను ప్రదర్శించుకునేందుకు ఇటు తెలంగాణ అటు ఏపీ ప్రభూత్వాలు అనుమతులిచ్చాయి. దాంతో నిర్మాతలు రెండు ప్రాంతాలలో కొన్ని చోట్ల బెనిట్ షోలను ప్రదర్శించారు.

    allu-arjun-arrested-in-sandhya-theater-stampede
    allu-arjun-arrested-in-sandhya-theater-stampede

    Allu Arjun Arrest: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

    ఈ బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. అయితే, హైదరాబాద్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 35ఎంఎం సంధ్య 70 ఎంఎం థియేటర్స్ కి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలతో పాటు కొందరు వీఐపీలు హాజరయ్యారు. ఈ విషయం తెలిసిన అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి మృతి చెందారు. దీనికి హీరో అల్లు అర్జున్ కారణం అని ఈరోజు ఉదయం ఆయనని తన నివాసంలో అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.