Aishwarya Deepam: మామూలుగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మిదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలను పాటించడంతో పాటు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. చాలామంది ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటివారు ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలు అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు అప్పులకు స్వస్తి పలకడం ఖాయం. మరి ఇంతకీ ఐశ్వర్య దీపం అంటే ఏమిటి? ఈ దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత వెలిగించిన వారికి ఐశ్వర్యాలు కలుగుతాయి.
వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. వ్యాపారాలు గణనీయంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బులు కూడా చేతికి అందుతాయి. అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్న వారు, అప్పులపాలై బాధలు పడుతున్న వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే వారికి ఆర్థిక ప్రగతి కలుగుతుంది.
ఇక ఐశ్వర్యాన్ని అందించే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి అన్న విషయానికి వస్తే.. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పెద్ద ప్రమిదలను తీసుకుని వాటికి పసుపు, కుంకుమ రాయాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి, ఆ ముగ్గులో ఒకదానిపై ఒకటిగా పెట్టి, ఒక పావు కిలో రాళ్ల ఉప్పు వేసి, ఆ రాళ్ళ ఉప్పుపైన పసుపు, కుంకుమ చల్లాలి.
దానిపై ఒక చిన్న ప్రమిదను పెట్టి రెండు వత్తులు ఒకటిగా వేసి దీపం వెలిగించాలి. దీనినే ఐశ్వర్య దీపం అంటారు. ఇక ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు, పళ్ళు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా పెట్టి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకోవాలి. కనకధార స్తోత్రాన్ని కూడా చదివితే మంచిదని చెబుతున్నారు. శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి, ఆ ఉప్పును నీటిలో కలిపి ఎవరూ తొక్కనిచోట పోయాలి. ఇలా 11, 16, 21, 41 శుక్రవారాలు చేస్తే ఆర్ధిక ఇబ్బందుల నుండి ఈజీగా బయట పడవచ్చు. ఐశ్వర్య దీపంతో ఆర్ధిక సమస్యల నుండి కొంతమేర ఉపశమనం తప్పక లభిస్తుంది. కనుక ఊహించని ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్న వారు ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.