Categories: LatestMoviesTips

Prashanth Neil : హనుమాన్‌ కు వచ్చిన ప్రతీ ఒక్క రూపాయిని వాటికోసమే వినియోగిస్తున్నాం

Prashanth Neil : పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న సౌత్ ఇండియన్ సినిమాలు సెన్సేషనల్ హిట్స్ సాధిస్తున్నాయి. బాహుబలి సినిమా మొదలు ఆర్ఆర్ఆర్, సలార్ లేటెస్ట్ గా హనుమాన్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. అయితే మిగతా సినిమాలో ఓ లెక్క హనుమాన్ మూవీ మరో లెక్క. ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ హీరో సినిమాతో యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యి 17 రోజులు అవుతున్నా వసూళ్ల సునామి కొనసాగుతూనే ఉందీ. ఇప్పటికీ చాలా థియేటర్లలో టికెట్లు దొరకడం లేదు. ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది . సినిమా రిలీజ్ కి ముందుగా చెప్పినట్లుగానే హనుమాన్ టీం ఇప్పటికీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ కు ప్రతీ టికెట్ పై 5 రూపాయలను విరాళంగా అందించింది. లేటెస్ట్ గా నిర్మాత నిరంజన్ రెడ్డి మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హనుమాన్ సినిమా నుంచి వచ్చిన ప్రతీ రూపాయని ఆ రెండింటి కోసమే వినియోగించనున్నట్లు తాజాగా ప్రశాంత్ వర్మ నే చెప్పాడు.

prashanth-neil-interesting-comments-on-hanuman-movie

 

తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి అనేక రికార్డులను క్రియేట్ చేసింది. ఆడపడుచుకు కట్నం ఇవ్వలేదట.. అందుకే నిహారిక కోసం ఆ పని చేస్తుందట.. లావణ్య కామెంట్లు వైరల్! చిత్రబృందం ఎప్పటికప్పుడు సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. నెక్స్ట్ వచ్చే సీక్వెల్ చిత్రాల గురించి అప్ డేట్లు ఇస్తున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే దర్శకుడు మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాల గురించి చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చి ప్రతీ రూపాయిని ఓ రెండు పనుల కోసం మాత్రమే ఉపయోగించబోతున్నట్లు వివరించారు.

prashanth-neil-interesting-comments-on-hanuman-movie

ఈ మధ్యనే అయోధ్య రామ మందిరానికి ప్రతి టికెట్ నుంచి ఐదు రూపాయల డొనేషన్ ను హనుమాన్ మూవీ టీం అందించింది. కేవలం అయోధ్య రామయ్యకే కాదు భద్రాచలంలో కొలువుదీరిన రామాలయానికి చిన్న ఆలయాలకు ప్రతి టికెట్ నుంచి ఓ రూపాయిని విరాళంగా ఇస్తున్నట్లు టీం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ దేవుడికి విరాళం ఇచ్చినట్లుగా ఫీల్ అవుతారని మేకర్స్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి రూపాయిని సీక్వెల్స్ కి వినియోగించబోట్లు నిర్మాత తనకు చెప్పాడని ప్రశాంత్ వర్మ తెలిపాడు. హనుమాన్ కు సీక్వల్ గా వచ్చే జై హనుమాన్, ఆపై వచ్చే సినిమాలకు ప్రాఫిట్స్ వినిగిస్తామని వివరించారు. ఈ విషయాలు తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

3 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

5 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.