Aadhar Update: ఆధార్ కారు ప్రస్తుతం దైనందిన జీవితంలో అత్యవసరం అనే సంగతి అందరికి తెలిసిందే. ఉద్యోగాలు చేస్తున్న జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. అది లేకపోతే ప్రస్తుత సాంకేతిక యుగంలో చాలా పనులు నిలిచిపోతాయి. ఆదాయ వనరులు కూడా ఆగిపోతాయి. మనం రోజువారి మాట్లాడుతున్న ఫోన్ లో సిమ్ కావాలన్న కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఆధార్ కారులని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడుకి పౌరసత్వ గుర్తింపు కార్డు తరహాలో ఆధార్ కార్డు ఉండాల్సిందే అని రూల్ పెట్టారు.
అయితే ఆ సమయంలో ఫోన్ సదుపాయం లేకపోవడంతో ఫోన్ నెంబర్ ఎంట్రీ జరగలేదు. అలాగే ఆధార్ డేటాలో కూడా చాలా తప్పులు జరిగాయి. డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఇంటి పేరు ఇలా అన్నింట్లో కూడా తప్పులు జరిగాయి. అయితే ఈ తప్పులని సరిచేసుకోవాలంటే మీసేవా కేంద్రాలకి వెళ్లి 25 రూపాయిలు చెల్లించి ఆధార్ కార్డులో మార్పులని అప్డేట్ చేసుకోవాలి. అయితే ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కి సంబంధించి ఎలాంటి రుసుము అవసరం లేదనే నిబంధనని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ ఫ్రీ అధార్ అప్డేట్ అనేది కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది అని తెలిపింది.
ప్రజలు తమ ఆధార్ కార్డులో తప్పులని సరిచేసుకోవడానికి లభించిన ఈ గొప్ప అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు. సిఐడిఆర్ ప్రజల కచ్చితమైన సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ సేవలు అందిస్తుంది అని తెలిపింది. మార్చి 15 నుండి జూన్ 15 వరకూ ఈ ఉచిత ఆధార్ అప్డేట్ లబ్ధిని ప్రజలు పొందవచ్చు. ఆధార్ కార్డుని ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి వారి కొత్త వివరాలని మార్పు చేసుకోవడానికి అప్డేట్ చేయాలని కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఐడి ప్రూఫ్ గా ప్రస్తుతం మార్కెట్ లో ఆధార్ కార్డు తప్పనిసరి అయిన నేపధ్యంలో ఈ అప్డేట్ సేవలని వినియోగించుకోవాలని కేంద్రం తెలిపింది.