Thu. Feb 12th, 2026

    Prabhas : మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఉన్నపలంగా విదేశాలకి వెళ్ళినట్టు ఓ తాజా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాల తర్వాత టాలీవుడ్‌లో అందరికంటే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నారు.

    ఆ క్రమంలోనే అన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. వరుసగా సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టపోయినా ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K చిత్రాలతో పాటు స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఇవన్నీ ప్రభాస్ రేంజ్‌కి తగ్గవే.

    Is Prabhas going abroad because of health problems?
    Is Prabhas going abroad because of health problems?

    Prabhas : కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయించుకునేందుకే..?

    అయితే, ఇటీవల ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి తర్వాత ప్రభాస్ ఏమాత్రం ఖాళీగా ఉండదలచుకోలేదు. అందుకే, బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. అయితే, గత ఏడాది ప్రభాస్ కాలికి సర్జరీ జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేదు. అలాగే ఇప్పుడు కూడా ఇలా అఫీషియల్ అప్‌డేట్ లేకుండా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    ప్రభాస్ షూటింగ్ వదిలేసి ఒక్కసారిగా విదేశాలకి బయలుదేరారట. ఏయిర్ పోర్ట్‌లో కనిపించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఆరోగ్య సమస్య ఏదో వచ్చినట్టు..దానికోసమే కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయించుకునేందుకే ఆయన విదేశాలకి వెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో ఆయనే స్వయంగా వెల్లడిస్తే గానీ క్లారిటీ దొరకదు.

     

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.