Wed. Jan 21st, 2026

    Shalini Pandey : మొదటి సినిమాతోనే హీరోతో హద్దులు మీరి మరీ రొమాన్స్ చేసి బోల్డ్ స్టార్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది షాలినీ పాండే. స్టార్ హీరోయిన్‌లు కూడా చేయని డేరింగ్ సీన్స్‌ను అవలీలగా పండించి అదరగొట్టింది. యంగ్ హ్యాండ్సమ్‌ రౌడీ బాయ్ విజయ్‌దేవర కొండతో కలిసి అర్జున్ రెడ్డి సినిమాలో ఈ భామ చేసిన రచ్చ ఆల్ ఇండియాను షేక్ చేసేసింది.

    Shalini Pandey : glamours looks in amazing purple dress
    Shalini Pandey : glamours looks in amazing purple dress

    అంతకు ముందు ఏ హీరోయిన్ చేయనన్ని లిప్ లాక్ సీన్స్ లోనూ నటించి ఒక్క సినిమాతోనే విపరీతమైన గుర్తింపును దక్కించుకుంది. తన నటనతో, క్యూట్ లుక్స్‌తోఅందరినీ మంత్రముగ్ధులను చేసింది షాలినీ పాండే. అయితే ఈ ఒక్క సినిమానే అమ్మడి కెరీర్‌లో ఓ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సినిమా హిట్ అయినా అమ్మడు యాక్టింగ్ అదరగొట్టినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలోనే పడిపోయింది ఈ బ్యూటీ.

    Shalini Pandey : glamours looks in amazing purple dress
    Shalini Pandey : glamours looks in amazing purple dress

    అర్జున్‌రెడ్డి సినిమాతో షాలినీ రేంజ్ మారిపోతుందని అనుకున్నారు అంతా. కానీ అమ్మడి లక్ పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిని ఈ చిన్నది అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత మొదలుపెట్టింది. అందరి దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్‌లు చేస్తోంది. తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసి హాట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

    Shalini Pandey : glamours looks in amazing purple dress
    Shalini Pandey : glamours looks in amazing purple dress

    షాలిని తెలుగు పరిశ్రమలో పనిచేయడానికి ముందు మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో థియేటర్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగు స్పష్టంగా తెలియకపోయినా, అర్జున్ రెడ్డిలో సొంతంగా షాలిని డబ్బింగ్ చెప్పింది. ఆ తరువాత హీరోయిన్ క్యరెక్టర్లు రాకపోయినా సినిమా రంగాన్ని వీడకుండా సపోర్టివ్ క్యారెక్టర్లను చేసింది. మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా నటించింది, నిషబ్దం సినిమాలో అనుష్క స్నేహితురాలిగా నటించింది. అయినా అమ్మడికి మంచి అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది.

    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress
    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress

    యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌లో 2022 విడుదలైన జయేష్‌భాయ్ జోర్దార్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన లీడింగ్ లేడీగా షాలినీ పాండే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మహిళా సాధికారత అనే ప్రధానాంశంతో ఈ చిత్రం తెరముందుకు వచ్చింది. ఈ సినిమాలో షాలిని తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత షాలినీకి మరో సినిమా లేదు.

    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress
    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress

    సినిమాల్లో నటించకపోయినా తన హాట్ లుక్‌లతో సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తోంది షాలినీ పాండే. తన బోల్డ్ లుక్‌తో అభిమానులను తన వైపు ఎలా ఆకర్షించాలో ఈ భామకు బాగా తెలుసు. ఇటీవల, నటి తన తాజా ఫోటోషూట్ సమయంలో కొన్ని చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె చాలా హాట్‌గా కనిపించింది.

    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress
    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress

    తాజాగా నటి షాలినీ పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తాజా ఫోటోషూట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ చిత్రాలలో, షాలినీ పాండే లైట్ పర్పుల్ కలర్ లో ఉన్న స్టైలిష్ ఆఫ్ షోల్డర్ టాప్‌తో థాయ్ హై స్లిట్ స్కర్ట్‌ని ధరించింది తన అందాలను ప్రదర్శించింది. ఈ చిత్రాలలో నటి షాలిని పాండే చాలా హాట్ లుక్స్‌లో కనిపించింది. షాలినీ పాండే ఓపెన్ హెయిర్, లైట్ మేకప్‌తో నేలపై కూర్చొని కెమెరాకు గ్లామరస్‌ పోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా టాప్ భాగంలో రౌండ్ కట్ అవుట్ డీటైల్ తో తన ఎద అందాలను చూపించి చూపించకుండా చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. షాలినీ ఈ రూపాన్ని చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress
    shalini-pandey-glamours-looks-in-amazing-purple-dress