Technology: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ వరల్డ్ నడుస్తుంది. సుమారు 90 శాతం మంది ప్రజలు చేతిలో సెల్ ఫోన్ తో ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. సమస్త సమాచారం చేతిలో ఉన్న ఫోన్ లో లభించడంతో పాటు, బంధువుల, కుటుంబ సభ్యులు, స్నేహితులు అలాగే కొలీగ్స్ అందరితో కూడా కమ్యునికేషన్ లో ఉండటానికి సెల్ ఫోన్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఫోన్ లో మెసెంజర్ సర్వీస్ ద్వారా చాలా వేగంగా మెసేజ్ లని ఎవరికైనా పంపించడం సాధ్యం అవుతుంది. ఇప్పుడంటే ఇంటర్నెట్ మీద నడిచే మెసెంజర్ సర్వీస్ లు అందుబాటులోకి వచ్చాయి.
అయితే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజ్ యాప్స్ లేనప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడర్ మీద నడిచే మెసేజ్ యాప్ లు, వెబ్ సైట్స్ రాకముందు టెక్స్ట్ మెసేజ్ సర్వీస్ ఉండేది. ఈ టెక్స్ట్ మెసేజ్ సర్వీసుని ఆరంభంలో టెలికాం కంపెనీలు ఆఫర్స్ తో నడిపించేవి. ఎక్కువ మెసేజ్ ఫ్రీ సర్వీసుఇచ్చే సిమ్ లని వాడటానికి ప్రజలు కూడా ఇష్టపడే వారు. అయితే ఈ టెక్స్ట్ మెసేజ్ లకంటే ముందుగా ఇంటర్ కామ్ మెసేజ్ లు ఉండేవి. అంటే ఒక కంపెనీలో అంతర్గత సమాచార ప్రసారం కోసం ఇంటర్ కామ్ మెసేజ్ సేవలు ఉండేవి. అయితే ఈ మెసేజ్ సేవలు టెలికాం సర్వీస్ లు స్టార్ట్ చేసి ఇప్పటికి 30 ఏళ్ళు పూర్తయ్యింది.
వొడాఫోన్ ఇంజినీర్ మొట్టమొదటి సారిగా ఎస్ఎంఎస్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ చేసారు.1992లో మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్ ద్వారా టెస్ట్ మెసేజ్ సర్వీస్ వచ్చింది అందుబాటులోకి. వొడాఫోన్ ఇంజనీర్ తన బాస్ కు తొలి ఎస్ఎంఎస్ పంపించారు. 1992 డిసెంబర్ 3న బెర్క్ షైర్ కు చెందిన వొడాఫోన్ ఇంజనీర్ నెయిల్ పాప్ వర్త్ మెర్రీ క్రిస్మస్ అంటూ తన బాస్ రిచర్డ్ జార్వీస్ కు ఎస్ఎంఎస్ చేశారు. అయితే ఆరంభంలో సెల్ ఫోన్ బరువు సుమారు రెండు కిలోల పైన ఉండేది. దానిని ఇంట్లో వినియోగించడం తప్ప తీసుకెళ్ళడం చాలా కష్టం అయ్యేది.
ఈ నేపధ్యంలో తమ కంపెనీ ఇంజనీర్ పంపించిన మొదటి మెసేజ్ కి రిచర్డ్ జార్వీస్ సమాధానం ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో ఎలాంటి టెక్స్ట్ మెసేజ్ సర్వీస్ కి ఈ స్థాయిలో గుర్తింపు వస్తుందని అతను ఊహించనేలేదు. ఈ విషయాన్ని కూడా ఓ సందర్భంలో అతను చెప్పడం విశేషం. ఇక ప్రస్తుతం వాట్సాప్ మెసెంజర్ యాప్ మెసేజ్ సర్వీస్ లని అందించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. అలాగే ఈ వాట్సాప్ ద్వారా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం కూడా జరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట. అలాగే కంపెనీలు అంతర్గత సర్వీస్ ల కోసం ఉద్యోగులతో నిత్యం కమ్యునికేషన్ లో ఉండేందుకు వాట్సాప్ గ్రూప్స్ పనిచేస్తూ ఉండటం విశేషం.