Technology: వాట్సాప్ వినియోగం ప్రస్తుతం దైనందిన జీవితంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి లైఫ్ లో భాగం అయిపొయింది. వాట్సాప్ కారణంగా సందేశాలు పంపించుకోవడం సులభతరం అయిపొయింది. అలాగే గ్రూప్స్ పెట్టుకొని కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ వెసులుబాటు కల్పించింది. అలాగే వీడియో కాల్స్, గ్రూప్ వీడియో కాల్స్ సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఫైల్ ట్రాన్స్ ఫర్ సర్వీస్ కూడా ఉంది. ఇక గతంలో 500 మంది వరకు మాత్రమే వాట్సాప్ గ్రూప్స్ లో మెంబర్స్ ని యాడ్ చేయడానికి అవకాశం ఉండేది.
అయితే ఇప్పుడు ఆ నెంబర్స్ జాబితా వెయ్యికి పెంచడానికి పేస్ బుక్, వాట్సాప్ యాజమాన్యం సిద్ధం అయ్యింది. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థని మరింత విస్తృతం చేయడానికి కొత్త కొత్త అప్డేట్స్ ని వాట్సాప్ లో ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు. అదే సమయంలో సెక్యూరిటీ అలర్ట్స్ కూడా డిఫాల్ట్ గా రన్ అవుతున్నాయి. కొంత మంది ఈ వాట్సాప్ గ్రూప్ లని తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు. విద్రోహ భావజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి, అలాగే దేశ తప్పుడు వార్తలని స్ప్రెడ్ చేసి సమాజంలో అశాంతి పెంచడానికి వాట్సాప్ గ్రూప్ లని వినియోగిస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఇప్పటికే ఆ తరహా వాట్సాప్ గ్రూప్స్ వేల సంఖ్యలో బయటపడ్డాయి. వాట్సాప్ గ్రూప్స్ మీద నిరంతర పర్యవేక్షణని ఇప్పుడు సంస్థ కూడా చేస్తుంది. గ్రూప్స్ ద్వారా గాని లేదంటే పర్సనల్ గా కానీ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తే అలాంటి నెంబర్స్ స్పామ్ జాబితాలో చేరుస్తాయి. ఒక వేళ రెగ్యులర్ గా అలాంటి మెసేజ్ లని ఫార్వార్డ్ చేయడం, లేదంటే సృష్టించి సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ నెంబర్స్ కి వాట్సాప్ బ్లాక్ అయిపొయింది. కొత్తగా మెటా సంస్థ ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరంతర నిఘాతో విద్రోహ శక్తులు, అశాంతిని ప్రేరేపించే సందేహాలని ఫిల్టర్ చేయడానికి ఒక పర్యవేక్షక టీమ్ కూడా పని చేస్తుందని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఏదైనా ఒక సమాచారం మన దగ్గరకి వచ్చినపుడు ఒకటికి రెండు సార్లు దానిని నిర్ధారించుకొని ఫార్వార్డ్ చేసే ప్రయత్నం చేయాలని, ఒక వేళ డౌట్ ఉంటే తక్షణమే అలాంటి సందేశాల్ని డిలేట్ చేయడం ఉత్తమం అని టెక్ నిపుణులు చెబుతున్నారు.