Wed. Jan 21st, 2026

    Food: ప్రతిరోజు చాలా రకాల ఆహారాలను తింటుంటాము. ఒక్కో ఆహారంతో ఒక్కో రకంగా మన శరీరానికి మేలు జరుగుతుంది. ప్రతి దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆహారంలోనే ఔషధం ఉంది అంటుంటారు డైటీషియన్లు. అలాంటి ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందకు వచ్చేశాము.

    పన్నీర్ ను తినేందుకు చాలా మంది పెద్దగా ఆసక్తి చూపరు కానీ అందులో అందుబాటులో ఉండే పోషకాలను తెలుసుకుంటే తప్పక తింటానంటారు. ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్లు, ఫోలెట్లు, విటమిన్లు, మినరల్స్ , కాల్షియం ఇలా ఎన్నో పోషకాలు పన్నీర్ లో నిక్షిప్తమై ఉన్నాయి. పన్నీర్‌ను రోజూవారి ఆహారంలో భాగం చేసుకోడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఛర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెరుస్తుంటుంది. ఈ మధ్యన బరువు కోల్పోవాలనుకునే వారు కొద్ది మొత్తంలో పన్నీర్‌ను తీసుకుంటున్నారు. ఇందులో బరువు తగ్గించే లినోలెయిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. కాల్షియం, భాస్వరంలు పన్నీర్‌లో ఉండటం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. నీరసం, సిక్‌నెస్‌, తగ్గించి శరీరాన్ని యాక్టివ్‌గా మారుస్తుంటుంది.

    paneer fried rice with night left over riceకావాల్సిన పదార్ధాలు :
    పన్నీరు : 150 గ్రాములు
    టమాటాలు : రెండు
    వెల్లుల్లి రెబ్బలు : 4
    నూనె :తగినంత
    ఉప్పు : తగినంత
    కొత్తిమీర : గుప్పెడు
    బాస్మతీ రైస్ : రెండు కప్పులు
    ఉల్లిగడ్డ : ఒకటి
    క్యాబేజ్‌ : 1/2 కప్పు
    కారం : 1 టీ స్పూన్‌
    బ్లాక్ పెప్పర్ : 1/2 టీ స్పూన్
    సోయా సాస్‌ : 1 1/2 టేబుల్ స్పూన్‌

    తయారీ విధానం :
    ముందుగా కూరగాయ ముక్కలను పన్నీర్ తో సహా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను , వెల్లుల్లిని నూనెలో వేసుకోవాలి. రెండు నిమిషాలు వాటిని వేగనివ్వాలి. ఇప్పుడు మంటను కాస్త పెంచి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, క్యాబేజీ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వాటిని వేగనివ్వాలి. ఇప్పుడు సోయా సాస్‌తో పాటు కారం, పెప్పర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని లేదా రాత్రి మిగిలిన రైస్‌ను పన్నీర్ ముక్కలను కడాయిలో వేసుకోవాలి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కు సరిపడా వేడి వేడి అన్నంపైన కొత్తిమీరతో గార్నిష్‌ చేసి హాట్ గా సర్వ్ చేస్తే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.

    మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని భావిస్తున్నాము. ఎప్పుడైనా ఇంట్లో నైట్ మిగిలిన అన్నంతో ఇలా ఈజీ టు కుక్ రెసీపీస్‌ను ట్రై చేయండి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.