Wed. Sep 30th, 2026

    Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం, ఈ సినిమాకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు, ఈ వర్క్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాని సరసన నటించబోయో హీరోయిన్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే, సుజీత్ కొంతమంది పేర్లను నానీకి సూచించినట్టుగా తెలుస్తోంది.

    ఢిల్లీలో నేపథ్యంగా ‘బ్లడీ రోమియో’:

    సుజీత్ కి స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టుంది. ప్రభాస్‌తో తీసిన సాహో ఆ తర్వాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలను చూస్తే, ఈ విషయం అర్థమవుతుంది. హీరో ఎలివేషన్స్‌ని సుజీత్ అద్భుతంగా తెరకెక్కిస్తాడు. హాలీవుడ్ సినిమాలలో ఉండేటువంటి హై ఓల్టేజ్ ఛేజింగ్ సీన్స్, హెవీ అల్ట్రా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్‌ని సుజీత్ బాగా చూపిస్తాడు. ఇప్పుడు, నాని హీరోగా రూపొందబోతున్న బ్లడీ రోమియో కూడా ఇలాంటి అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్, డార్క్ హ్యూమన్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇక, బ్లడీ రోమియో ఫస్ట్ షెడ్యూల్ ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారట.

    Tollywood: బ్లడీ రోమియోకి జూలియెట్ ఎవరు?

    tollywood-how-many-heroines-are-there-in-nanis-bloody-romeo
    tollywood-how-many-heroines-are-there-in-nanis-bloody-romeo

    నాని సరసన ఈ సినిమాలో ఇప్పటికే, పలువురు క్రేజ్ ఉన్న గ్లామర్ బ్యూటీస్ పేర్లను పరిశీలించారట. ప్రధానంగా, ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. ఈ బ్యూటీ ఇప్పటికే నాని సరసన రెండు సినిమాలను చేసింది. తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీతోనే ప్రియాంక టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత, సరిపోదా శనివారం అనే సినిమాలోనూ నాని సరసన నటించింది. అంతేకాదు, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాలో పవన్ సరసన నటించింది. కాబట్టి, ఎక్కువగా ప్రియాంకకి ఛాన్స్ ఉంది.

    ప్రియాంక అరుళ్ మోహన్ పేరు మాత్రమే కాకుండా..వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి పేరు కూడా నాని సినిమాకి పరిశీలనలో ఉంది. అలాగే, అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి, పూజా హెగ్డేల పేర్లు వార్తల్లో ఉన్నాయి. మరి, సుజీత్-నాని వీరిలో ఎవరిని ఫైనల్‌గా ప్రకటిస్తారో చుడాలి. ఇక, ది ప్యారడైజ్ సినిమాతో నాని మరోసారి మాస్ అండ్ యాక్షన్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.