TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఎప్పుడు లేనివిధంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక నిత్యం లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్న నేపథ్యంలో భారీ స్థాయిలో హుండీ ఆదాయం కూడా వస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా తిరుమల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చినట్టు అధికారులు తెలియజేశారు.
ఈ క్రమంలోనే మంగళవారం (ఆగస్టు 18) న శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలియజేశారు. కేవలం మంగళవారం మాత్రమే రూ.6.12 కోట్ల రూపాయలు భక్తులు హుండీలో కానుకలుగా సమర్పించినట్లు తెలియచేశారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగినట్లు తెలిపారు. జూలై నెలలో తిరుమల హుండీ ఆదాయం 140.28 కోట్లు రావడం విశేషం తిరుమల ఆలయ చరిత్రలోనే ఇది అత్యధికమని అధికారులు తెలియజేశారు. ఇక మంగళవారం ఒక్కరోజులోనే రూ.6.12 కోట్ల ఆదాయం రావటం విశేషం.

TTD: శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
ఇక త్వరలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తిరుమల కొండపైకి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి సాల కట్ట బ్రహ్మోత్సవాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు విఐపి బ్రేక్ దర్శనాలను కూడా అధికారులు నిలిపివేశారు. ఈనెల 22వ తేదీ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలను సజావుగా నిర్వహించడం కోసం 22 ,24వ తేదీలలో విఐపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది ఈ విషయాన్ని భక్తులు గమనించాల్సిందిగా అధికారులు కోరారు.

