Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి వంటి వాటిని పరిగణలోకి తీసుకొని మంచి ముహూర్తంలో శుభకార్యాలను ప్రారంభిస్తుంటాము. అయితే మంగళవారం మాత్రం ఎలాంటి కొత్త పనులను ప్రారంభించడానికి ఇష్టపడము. మంగళవారం కొత్త పనులు ప్రారంభించడం అశుభంగా పరిగణిస్తూ ఉంటారు. నిజంగానే మంగళవారం శుభకార్యాలు చేయకూడదా? శుభకార్యాలు చేస్తే అశుభం కలుగుతుందా? అసలు మంగళవారం శుభకార్యాలు చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఈ విషయం పట్ల శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయానికి వస్తే..
మన హిందూ సంప్రదాయాల ప్రకారం మంగళవారం నాడు ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజున మనం ఏదైనా శుభకార్యాలు ప్రారంభిస్తే శుభం కలుగుతుందని శాస్త్రం కూడా చెబుతుంది. మంగళవారం రోజున మనం చేసే ఏ పనులైన మనకు అదృష్టాన్ని తీసుకువచ్చి పురోగతిని కల్పిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే వారికి మంగళవారం శుభ సూచకం అని శాస్త్రం చెబుతోంది. మంగళవారం రోజున పెట్టుబడులు, శుభ కార్యాలు, కొనుగోలు చేయడానికి చాలా శుభదినం.

Tuesday Auspiciousness: ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు..
ఇక మంగళవారం రోజున ఇలాంటి పనులను ప్రారంభించాలనుకునే వారు ముందుగా హనుమంతులని పూజించి పనులు చేయటం వల్ల అన్ని విజయవంతంగా పూర్తి అవుతాయి. మంగళవారం హనుమంతుడికి ఎంత ఇష్టమైన రోజు కావడంతో ఆ రోజున స్వామివారికి తమలపాకులతో, సింధూరంతో ప్రత్యేకంగా పూజలు చేయాలి. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక పూజ అనంతరం హనుమాన్ చాలీసా, పారాయణం వంటి వాటిని చేయటం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, శత్రు బాధల నుంచి రక్షణ లభిస్తుందని , మనం చేసే పనులు విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.

