Tirumala Darshan Tickets: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే స్వామివారి దర్శనార్థం భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తున్నారు. ఇక స్వామివారి దర్శనం కోసం ముందుగానే టికెట్లకు సంబంధించిన టోకెన్లను జారీ చేయడంతో భక్తులకు స్వామివారి దర్శనం మరింత సులభతరం అవుతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో స్వామివారి దర్శనం నిమిత్తం వివిధ ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు వసతి కోటకు సంబంధించిన షెడ్యూల్ ను టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
స్వామివారికి నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ప్రధాన ఆర్జిత సేవల టికెట్లను జూన్ 18న ఉదయం 10 గంటలకు ఈ సేవల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా నమోదు చేసుకున్న వారిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు.లక్కీ డిప్‌లో సీటు దక్కించుకున్న భక్తులు జూన్ 20వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా డబ్బులు చెల్లించుట వారికి మాత్రమే ఆర్జిత సేవా టికెట్లు ఖరారు చేస్తారు.

Tirumala Darshan Tickets:రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్..
ప్రధానంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లను భక్తులు నేరుగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ సేవల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముందుగా వచ్చిన వారికి మాత్రమే టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన వర్చువల్ సేవల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (స్పెషల్ ఎంట్రీ దర్శన్) టికెట్ల కోటాను జూన్ 24వ తేదీన విడుదల చేస్తారు. ఉదయం 10 గంటలకు ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

