Fri. May 1st, 2026

    RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రాన్ని చేస్తున్నాడు రామ్ చరణ్. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శృతి హాసన్ ఓ స్పెషల్ నంబర్ లో కనిపించబోతుంది. తాజాగా, చరణ్-శృతిలపై ఈ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీపై ఇప్పటికే, అందరిలో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.

    మార్చి 27నే రిలీజ్ కావాల్సిన పెద్ది.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయినా కూడా సినిమాకి సంబందించిన పనులు పూర్తి కాలేదు. దాంతో, ఈ సినిమాను మరోసారి పోస్ట్ పోన్ చేసి..స్వయంగా దర్శకుడు బుచ్చిబాబే జూన్ 25న రిలీజ్ చేయబోతున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశాడు. ఈ క్రమంలో చరణ్ నటించబోతున్న తన 17వ సినిమాకి సంబందించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ది మూవీని రిలీజ్ చేసిన వెంటనే, సుకుమార్ మూవీని సెట్స్‌పైకి తీసుకువచ్చేలా చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడట.

    from-june-onwords-sukumar-ram-charans-rc-17-start
    from-june-onwords-sukumar-ram-charans-rc-17-start

    RC 17: 027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేలా సుకుమార్ సన్నాహాలు చేస్తున్నారట. 

    గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎంత భారీ హిట్ సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీని సంపాదించుకున్నాడు. పుష్ప ఫ్రాంఛైజీస్‌తో సుకుమార్ కూడా పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయో సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే, ఆ కథ రంగస్థలం మూవీకి సీక్వెల్ గా ఉంటుందా..లేక పూర్తిగా కొత్త కథతో రూపొందుతుందా అనేది ఇంకా తెలియలేదు.

    ఇక, ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి. జూన్ నుంచి మొదలుపెట్టి 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేలా సుకుమార్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. మైత్రీ నుంచి వచ్చిన పుష్ప ఫ్రాంఛైజీస్, రంగస్థలం.. ఆ సంస్థనే అగ్ర స్థానంలో నిలబెట్టాయి. దీనికి, ప్రధానంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు సుకుమార్ గురించి. మళ్ళీ, ఇలాంటి కాంబోలో సినిమా అంటే ఖచ్చితంగా అందరిలోనూ అంచనాలు తారా స్థాయిలోనే ఉంటాయి. మరి, సుక్కూ ఈ ప్రాజెక్ట్ ను ఎప్పుడు పట్టాలెక్కించనున్నాడో..దీనికి సంబందించిన అప్‌డేట్స్ ఎప్పుడు ఇవ్వబోతున్నాడో.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.