Pawan Kalyan-Suswagatham: సౌందర్య..ఈ పేరు వింటే చాలు ప్రతీ ఒక్కరికీ ఆమె నటించిన అద్భుతమైన సినిమాలు కళ్ళ ముందు అలా ప్రవాహంలా మెదులుతాయి. మాతృ భాష కన్నడ అయినప్పటికీ..తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది సౌందర్య. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో హీరోయిన్గా నటించింది. సావిత్రి తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్న సౌందర్య..తాను నటించిన సినిమాలలో అధికశాతం హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్సే ఉన్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నీ ప్రధాన భాషల్లో అందరు స్టార్ హీరోలతో నటించిన గొప్ప నటీమణి.
హిందీలో అమితాబ్ బచ్చన్ సరసన కూడా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. పెదరాయుడు, నా మనసిస్తారా లాంటి సినిమాలలో నెగిటివ్ రోల్స్ కూడా చేసి మెప్పించింది. అయితే, ఇంత గొప్ప నటిని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పక్కన హీరోయిన్గా తీసుకుందామని చెప్తే ససేమిరా అంటూ నిరాకరించాడు. ఆ సినిమా ఏది, ఎందుకు పవన్ కళ్యాణ్ తన పక్కన హీరోయిన్గా సౌందర్యను వద్దనడానికి కారణాలు పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం.

Pawan Kalyan-Suswagatham: సౌందర్య నా పక్కన హీరోయిన్ అంటే నన్నెవరూ పట్టించుకోరు.!
పవన్ కళ్యాణ్ హీరోగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సినిమా వచ్చింది. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గోకులంలో సీత (1997) సినిమా వచ్చింది. ఇందులో రాశి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సుస్వాగతం అనే సినిమాను (1998) చేశాడు పవన్ కళ్యాణ్. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. తమిళంలో వచ్చిన లవ్ టుడే చిత్రానికి సుస్వాగతం రీమేక్. హీరోయిన్గా దేవయాని తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
అయితే, వాస్తవానికి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా ముందు సౌందర్యను అనుకున్నారట. ఆ విషయం పవన్ కళ్యాణ్ కి చెప్తే అస్సలు ఆమె నా పక్కన హీరోయిన్గా వద్దంటే వద్దు అని రిజెక్ట్ చేశాడట. దీనికి కారణం అప్పటికే హలో బ్రదర్, అమ్మోరు, దొంగాట, పవిత్రబంధం, అరుణాచలం లాంటి సినిమాలతో చాలా బిజీ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. అంతకంటే ఎక్కువగా సావిత్రి లాంటి హీరోయిన్ అనే ప్రశంసలు అందుకుంది. దాంతో, పవన్ కళ్యాణ్ కెరీర్లో మూడవ సినిమా అయిన సుస్వాగతం లో హీరోయిన్గా సౌందర్యను వద్దని నిరాకరించాడు.
అయితే ముఖ్యంగా, అమ్మోరు..అరుణాచలం లాంటి సినిమాలు చూసిన పవన్ కళ్యాణ్ ఆమె నటనకి ఫిదా అయి..తన పక్కన నేను నటించలేననే మాట ఒప్పుకున్నాడట. కానీ, కొందరు..సౌందర్య నా పక్కన హీరోయిన్ అంటే నన్నెవరూ పట్టించుకోరని పవన్ ఇదే కారణంతో సౌందర్యను రిజెక్ట్ చేశాడని చెప్తుంటారు. ఏది ఏమైనా ఓ మంచి కాంబినేషన్ మాత్రం మిస్ అయిందని చెప్పాలి. అలాగే, పవన్ కళ్యాణ్ కి ఇది ఒక లోటు అని కూడా నిర్మొహమాటంగా చెప్పొచ్చు.

