Sun. Mar 22nd, 2026

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోయినా కూడా కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే అందరిలో ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. అది కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడికే సాధ్యం. అయితే, తాజాగా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా గురించి ఇప్పుడు సినీ క్రిటిక్స్, సీనియర్స్ వసూళ్ల పరంగా ఇంత డల్‌గా ఉంటుందని ఊహించలేదంటున్నారు. గతంలో, గబ్బర్‌సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, మరోసారి పవన్ తో చాలా ఏళ్ళ తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను రూపొందించాడు.

    ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించినప్పటి నుంచే అందరిలో అంచనాలు బాగా నెలకొన్నాయి. పైగా, ఈ మూవీలోని పవన్ గెటప్..టీజర్ నుంచి వినిపించిన ‘గ్లాసంటే సైజు కాదు సైన్యం’.. అనే డైలాగ్ విపరీతంగా బజ్ క్రియేట్ చేసింది. రాను రాను ఆ అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి. హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశీఖన్నా కీలక పాత్రలలో పార్థిబన్..రావు రమేష్ లాంటి వారు నటించారు. మ్యూజిక్ పరంగా ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. ఇక, ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

    pawan-kalyan-is-ustad-bhagat-singhs-breakeven-also-difficult
    pawan-kalyan-is-ustad-bhagat-singhs-breakeven-also-difficult

    Pawan Kalyan: ఉస్తాద్ సినిమాపై ఆసక్తి తగ్గడానికి ఇదీ ఒక కారణం

    అయితే, ఈ సినిమా మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీలో ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షోస్ పడ్డాయి. అలాగే, యూఎస్ లోనూ షోస్ పడ్డాయి. ఆ తర్వాత సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. దీనికి తోడు ఉన్నపలంగా పవన్ కళ్యాణ్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల్లో అసలు బజ్ లేకుండా పోయింది. గత చిత్రం ఓజీ బాక్సాఫీస్ వద్ద సృష్ఠించిన సునామీ ఏ రేంజో అందరికీ తెలిసిందే. అంతకు మించి ఉస్తాద్ ఉంటుందనుకున్న వాళ్ళకి గట్టి షాకిచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనం తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు.

    ఓవరాల్‌గా సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ తన భుజాల మీద మోసినప్పటికీ, బ్రేకీవెన్ అవడం అతి కష్టంగా మారింది. ఎందుకు, పవన్ నటించిన తొలిప్రేమ సినిమాలోని పాటను..చిరంజీవి నటించిన సినిమాలలోని పాటలను ఉపయోగించారో అర్థం కాలేదు. ఇదే సమయంలో హిందీలో భారీ హిట్ సాధించిన ధురంధర్ సీక్వెల్ మూవీ ధురంధర్ 2 దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ కుర్చీ అంచున కూర్చొని ప్రతీ ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా వరకూ, ఉస్తాద్ సినిమాపై ఆసక్తి తగ్గడానికి ఇదీ ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. కంటెంట్‌లో దమ్ముంటే పవన్ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఓజీ చూపించింది. కాబట్టి, ఉస్తాద్ ఫలితానికి పూర్తిగా బాధ్యుడు దర్శకుడే అంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.