Sun. Mar 1st, 2026

    Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ నుంచి అప్‌డేట్స్ రావడం లేదని మెగా అభిమానులు ఈ మధ్య కొంత నిరాశలో ఉన్నారు. షూటింగ్ మొదలైనప్పుడు వచ్చిన చరణ్ మేకోవర్ ఫస్ట్ లుక్, ఫస్ట్ షాట్..ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి ప్రతీ ఒక్కరిలో ఊహించని అంచనాలను రేకెత్తించాయి. అప్పటి నుంచి సినిమాపై పెరుగుతున్న అంచనాలు వేరే లెవల్‌లో ఉన్నాయి. అయితే, సెకండ్ సాంగ్ విషయంలో.. అలాగే, తదుపరి అప్‌డేట్స్ విషయంలో మేకర్స్ బాగా స్లో అయ్యారు.

    దీనికి తోడు ‘పెద్ది’ సినిమాను చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించి, పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు. అది కూడా నెలకి పైగానే రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. ఇది బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే, ఇదే రిలీజ్ డేట్ కి దగ్గర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ వార్త అందరిలో ఆనందాన్ని కలిగించింది. ఇక, ‘పెద్ది’ సినిమా నుంచి అప్‌డేట్స్ ఎప్పుడొస్తాయో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    ram-charan-peddi-promotions-next-leval-from-march-2n-clarity-from-makers
    ram-charan-peddi-promotions-next-leval-from-march-2n-clarity-from-makers

    Ram Charan: సెకండ్ సింగిల్‌తో పాటు ‘పెద్ది’ సినిమా నుంచి మరికొన్ని క్రేజీ అప్‌డేట్స్

    ఈ నేపథ్యంలో మేకర్స్..మార్చి 2 నుంచి వరుసగా సినిమాకి సంబందించిన అప్‌డేట్స్ రాబోతున్నాయని చెప్పకనే చెప్పారు. తాజాగా, ఈ మూవీ నుంచి మార్చి 2వ తేదీన సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టుగా సోషల్ మీడియా హ్యాండిల్(ఎక్స్) ద్వారా వెల్లడించారు. అలాగే, చరణ్ లుక్ ని కూడా వదిలారు. మార్చి నెల మొత్తం కిక్ ఇచ్చే సాలీడ్ అప్‌డేట్స్ రానున్నట్టుగా మేకర్స్ తెలిపారు. సెకండ్ సింగిల్‌తో పాటు ‘పెద్ది’ సినిమా నుంచి మరికొన్ని క్రేజీ అప్‌డేట్స్ కూడా రాబోతున్నాయని అర్థమవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

    దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీ వచ్చింది. దీంతో, ‘పెద్ది’ చిత్రాన్ని అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. మరి, బాక్సాఫీస్ వద్ద చరణ్ ఎలాంటి సంచలన విజయం అందుకుంటాడో వేచి చూడాలి. ఇక, చరణ్ నటించబోయో నెక్స్ట్ సినిమా విషయంలో పలు వార్తలు పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ..అధికారికంగా మాత్రం ఏది కన్‌ఫర్మ్ కాలేదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.