Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్కను ఆధ్యాత్మిక మొక్కగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. ఇలా ఈ మొక్కకు ఆధ్యాత్మిక పరంగాను అలాగే ఆరోగ్య పరంగాను ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆధ్యాత్మిక నిపుణులు ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణములను తులసి కోటకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇలా ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి పూజ చేసే ఆరాధించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆరాధించినట్లేనని తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరిసంపదలకు ఏమాత్రం లోటు ఉండదని పండితులు చెబుతూ ఉంటారు. అందుకే ఉదయం సాయంత్రం తులసి కోటముందు దీపారాధన చేస్తూ పూజిస్తూ ఉంటాము. ఇలా ఆధ్యాత్మిక మొక్కగా భావించే ఈ తులసి కోటలో సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారని భావిస్తారు. కనుక తులసి కోటను మనం ఇంట్లో పెట్టి పూజించే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి.
మన ఇంట్లో తులసి కోటను పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా పాటించాలని అలాగే తులసి కోట చుట్టూ పొరపాటున కూడా చెప్పుల స్టాండ్ ఉంచకూడదు. అలాగే తులసి కోటలో ఎలాంటి చెత్తచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులసి చెట్టు పరిసర ప్రాంతాలలో ముళ్ళు కలిగిన చెట్లు ఉండకుండా చూసుకోవడం ఎంతో మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపైనే ఉంటుంది.