Mangoes: వేసవికాలం వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తాయి. ఇలా ఏడాదికి ఒకసారి దొరికే ఈ మామిడి పండ్లను తినడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు అయితే మామిడి పండ్లను కొంతమంది తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు అయితే గర్భం దాల్చిన మహిళలు వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లను తినవచ్చా తింటే ఆరోగ్యానికి మంచిదేనా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.
మరి గర్భంతో ఉన్నటువంటి మహిళలు మామిడి పండ్లను తినవచ్చా తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏంటి అనే విషయాలు గురించి నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే..
మామిడి పండ్లు విటమిన్ సికి పెట్టింది పేరు. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరడచంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గర్భిణీలు మామిడి పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో పెరిగే బిడ్డకు విటమిన్ సి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
బిడ్డ దంతాలు బలపడటం ఎముకలు బలపడటం అలాగే బిడ్డ రోగనిరోధక శక్తి పెరగడం అనేది జరుగుతుంది. ఇక ఈ మామిడిపండు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కూడా కాపాడుతుంది.మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి గర్భిణీలు ఎలాంటి సందేహం లేకుండా మామిడి పండ్లను తినవచ్చు అయితే రోజుకి ఒకటి లేదా రెండు తినవచ్చు అంతకుమించి ఎక్కువ తింటే కనుక కడుపులో ఉబ్బరం నిద్ర పట్టకపోవడం కొన్నిసార్లు వాంతులు మోషన్స్ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి.