Garlic: వెల్లుల్లి ఔషధాల గని అని చెప్పాలి వెల్లుల్లిని మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం వంటలలో ఉపయోగిస్తూ ఉంటాము వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల వంటకు తగినంత రుచి వాసన వస్తుంది కానీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి అనే సంగతి మనకు తెలిసిందే. అయితే చాలామంది వెల్లుల్లిని వలిచేటప్పుడు చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి వారికి ఖాళీగా ఉన్నప్పుడు నీటిగా వెల్లుల్లిని పొట్టు తీసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటూ ఉంటాము.
ఈ విధంగా వెల్లుల్లి ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల సమయం వృధా కాకుండా వంటలు కూడా తొందరగా చేయవచ్చని భావిస్తారు అయితే ఈ వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం వెల్లుల్లిని పొట్టు తీసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసేటప్పుడు గాలి వెళ్లకుండా బిగుతైన కంటైనర్ లో వేసి మూత పెట్టేయాలి అప్పుడే వాటిని ఫ్రిజ్లో నిలువ చేసుకోవచ్చు అలా కాకుండా ఒక గిన్నెలో వేసి పెట్టడం వల్ల తొందరగా వెల్లుల్లి పై ఫంగస్ వచ్చే ప్రమాదాలు ఉంటాయని తెలుస్తోంది.
కొన్నిసార్లు రిఫ్రిజిరేటర్‌లో తేమ పెరుగుతుంది. దీనిద్వారా వెల్లుల్లికి అచ్చు, ఫంగస్ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువని చెబుతారు.మనం రిఫ్రిజిరేటర్ డోర్‌ను పదే పదే తెరిచి మూసేస్తూ ఉంటాం. అలాంటప్పుడు లోపల ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు వస్తాయి. దీంతో వెల్లుల్లిలో శీలీంధ్రాలు పెరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి.వెల్లుల్లి ఒలిచిన తర్వాత, దానిలోని ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీని వల్ల ఒలిచిన వెల్లుల్లి క్రమంగా నల్లగా మారి కొద్ది తొందరగా చెడిపోతాయి అందుకే ఎప్పటికప్పుడు తాజాగా వలుచుకొని వంట చేయటం వల్ల వంటకు తగినంత రుచి వాసన రావడమే కాకుండా అందులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు.