Devotional Facts: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేస్తూ ఉంటాము ఇలా మన ఇష్ట దైవాలను కొలుస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం వల్ల మన ఇంట్లో మనశ్శాంతి ఎంతో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే చాలామంది తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా వ్రతాలు చేసే సమయంలోను లేదంటే దేవుడికి నైవేద్యాలు సమర్పించే సమయంలోను వారికి ఆచారాలు తెలియకపోవటం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.
ఈ విధంగా పూజ చేసే సమయంలోను మనం తెలిసి తెలియక కూడా ఇలాంటి తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా స్వామివారికి ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి పూజ చేస్తుంటారు అయితే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసి మంచి ఉతికిన దుస్తులను ధరించడం ముఖ్యం అలాగే స్వామి వారికి నైవేద్యం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా పూజ మందిరంతో పాటు ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాతే నైవేద్యం చేయాలి.
నైవేద్యం చేయడానికి ముందు వంటగదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలాగే చేసిన నైవేద్యం ఎప్పుడూ కూడా ఇనుప పాత్రలలోనూ ప్లాస్టిక్ గిన్నెలలో దేవుడికి పెట్టకూడదు దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత దానిని ప్రసాదంగా అందరికీ పంచాలి. అలాగే దేవుడి గదిలో ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలి. ప్రసాదం సమర్పించేటప్పుడు మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. దీని వల్ల అంతా శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు.