Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఆచార వ్యవహారాలను ఎంతగా విశ్వసిస్తామో వాస్తు పరిహారాలను కూడా అదే విధంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే మనం చేసే ప్రతి చిన్న విషయంలోనూ కూడా వాస్తుకు అనుగుణంగా ఆ పని చేయాలని భావిస్తూ ఉంటారు అయితే చాలామంది ఎదుర్కొనే సమస్యలలో ఆర్థిక సమస్యలు ఒకటి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే పలు పరిహారాలను పాటిస్తే మంచిదని వాస్తు నిపుణులు చెబుతుంటారు అయితే మన జీవితంలో ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేక వారి చెడు దృష్టి మనపై పెడతారు. అలాంటి సమయంలో నర దిష్టి చెడు దృష్టి మన కుటుంబం పై ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ విధంగా ఎప్పుడైతే మన ఇంటి బయట నరదృష్టి లేదంటే చెడు దృష్టి పడిందో ఆ క్షణం నుంచి ఆర్థిక ఇబ్బందులతో పాటు, ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధమైనటువంటి దిష్టి ప్రభావం నుంచి బయటపడాలి అంటే వాస్తు శాస్త్రానికి అనుగుణంగా కొన్ని పరిహారాలను పాటిస్తే చాలని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారాలు ఏంటి అనే విషయానికి వస్తే..
మనం పూజ గదిలో పూజ చేసే ఉంచినటువంటి కొబ్బరికాయను నూతన ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ కొబ్బరికాయను ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర లేదా పెరట్లో వేలాడటం వల్ల నరదృష్టి మన ఇంటి పై పడదు. అదే విధంగా మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కలబందను వ్రేలాడ తీయడం వల్ల కూడా నర దిష్టి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇకపోతే తమలపాకు చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కనుక మన పెరట్లో లేదా ఇంటి ఆవరణంలో తమలపాకు మొక్క ఉండటం శుభ సంకేతం అదే విధంగా ఇంట్లో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల కూడా వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.