Life Style: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకోవడానికి ముందుగా చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. ఒక క్లాస్ పాలు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని భావిస్తూ ఉంటారు అంతేకాకుండా పాలలో ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకోవడానికి ముందుగా పాలు తాగుతూ ఉంటారు.. అయితే రాత్రి పాలు తాగడం వల్ల శరీర బరువు పెరుగుతారని చాలామంది భావిస్తారు.
రాత్రికి పడుకోవడానికి ముందు గ్లాస్ పాలు తాగితే నిజంగానే శరీర బరువు పెరుగుతారా ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయానికి వస్తే..రాత్రిపూట పాలు తాగి పడుకుంటే మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. పాలలో పెద్ద మొత్తంలో లాక్టోస్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి రాత్రిపూట తాగితే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక గ్లాసు పాలలో కనీసం 120 కేలరీలు ఉంటాయి. రాత్రి పాలు తాగిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆ కేలరీలు ఖర్చు కాకపోవడంతో శరీర బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి.అందుకే వీలైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పాలను తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య పాలు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.