Health Tips: ఇటీవల కాలంలో మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లకు అనుకూలంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో చాలామంది అరికాళ్ళ మంటలు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అడుగుతీసి అడుగు వేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా అరికాళ్ళు మంటలు రావడానికి కారణం లేకపోలేదు.
ఎప్పుడైతే మన శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుందో అప్పుడు అరికాళ్ళ మంటలు ఏర్పడతాయి. అలాగే రక్తనాళాలు దెబ్బతిన్న సమయంలో కూడా అరికాళ్ళ మంటలు ఏర్పడతాయి. ఇలా అరికాళ్ళు మంటలుగా ఉన్న సమయంలో ఇంకెన్నో చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఈ చిట్కాలను కనుక పాటిస్తే తొందరగా ఈ నొప్పి మంట నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. మార్కెట్లో దొరికే ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఒక గిన్నెలో నీటిని పోసి ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా మిక్స్ చేసినటువంటి నీటిలో పాదాలను పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు కూర్చోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే బాగా పండిన బొప్పాయి పండును తీసుకొని అందులోకి కాస్త నిమ్మరసం పెరుగు వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల నొప్పి నుంచి లేదా మంట సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం ఒక టేబుల్ టీ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి పాదాలకు బాగా మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల అరికాళ్ళ మంటలనుంచి ఉపశమనం పొందవచ్చు.