Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఎన్నో విషయాలను పాటిస్తూ మనం పనులను చేస్తూ ఉంటాము. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వాస్తుకు అనుగుణంగా ఇంట్లో అన్ని గదులను నిర్మించి ఉంటారు. ఇక పూజగదిని కూడా అదే విధంగా నిర్మించి ఉంటారు. అయితే మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని గదిలో దీపారాధన చేసే స్వామి వారిని ప్రసన్నం చేసుకుంటూ ఉంటాము.
ఇక ఎవరి స్థోమతకు అనుగుణంగా వారు పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఈ విధంగా చాలామంది ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకుని ఉండగా మరికొందరు కిచెన్ లోనే ఒకవైపు పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు. అయితే చాలామంది ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసుకున్న వారు తలుపులు కూడా వేసి ఉంటారు. ఇక పూజ అయినా అనంతరం పూజగదికి తలుపులు వేస్తూ ఉంటారు కానీ రాత్రి పడుకునే సమయంలో పూజ గదికి కూడా తలుపులు వేయాలని పండితులు చెబుతున్నారు.
మనం రాత్రిపూట పడుకునే సమయంలో మన ఇంటిపై ఎవరికి కళ్ళు పడకుండా ఉండడం కోసం తలుపులు వేసుకొని ఎలాగైతే పడుకుంటామో అలాగే మనకల్లు దేవుడిపై ఉండకూడదన్న ఉద్దేశంతో దేవాలయంలో కూడా స్వామివారి ఆలయాలకు తలుపులు వేస్తూ ఉంటారు.అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరానికి కూడా తలుపులు వేసి మూసి వేయటం మంచిది ఇక తలుపులు లేనటువంటి వారు చిన్న పరదా అయిన స్వామివారికి కప్పివేయాలి. మనకు విశ్రాంతి ఎలాగా అవసరమో దేవ దేవతలకు కూడా విశ్రాంతి అవసరం కనుక అలా రాత్రి సమయంలో పూజ మందిరానికి తలుపులు వేయాలని పండితులు చెబుతున్నారు.