Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకునే సమయంలో వాస్తు శాస్త్రానికి అనుగుణంగానే ఆ ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వంటగది విషయంలో ఇలాంటి పద్ధతులను ఎక్కువగా పాటిస్తారు వంటగది ఎంత శుభ్రంగా వాస్తు ప్రకారం ఉంటే కనుక లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తూ ఉంటారు అందుకే కిచెన్ విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు.
ఇకపోతే కిచెన్ లో కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసే పనుల వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది వంటగదిలో చపాతీ లేదా రొట్టె చేస్తూ ఉంటారు అయితే మిగిలిన పిండిని అలాగే కిచెన్లో పెడుతూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల రాహు శని ప్రభావం మనపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మిగిలిన పిండిని వెంటనే బాక్స్ లో నిల్వ చేసుకోవడం లేదా దానిని పడేయడం వంటివి చేయాలి.
ఇటీవల కాలంలో వంటగది అందంగా కనిపించడం కోసం చాలామంది గ్లాస్ డోర్స్ వేసుకోవడం లేదంటే గాజు సీసాలలో ధాన్యాలను నిల్వ చేసుకోవడం జరుగుతుంది ఇలా గాజు సీసాలు కనక వంట గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఎంతోమంది వంటగదిలోనే టాబ్లెట్స్ పెట్టుకొని వాటిని మింగుతూ ఉంటారు ఇలా వంట గదిలో టాబ్లెట్స్ పెట్టుకోవడం వల్ల నెగటివ్ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశాలు ఉన్నాయని పొరపాటున కూడా టాబ్లెట్స్ వంట గదిలో పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.