Tue. Nov 18th, 2025

    Headache: సాధారణంగా ప్రతి ఒక్కరు సంపాదనలో పడి రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో వారి ఆహార నియమాలు నిద్ర సమయం కూడా పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇలా మనం సరైన సమయానికి తినకపోయినా, నిద్ర పోకపోయినా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే విధంగా చాలామందికి ఉదయం నిద్ర లేవగానే తల మొత్తం భారంగా ఉంటూ తలనొప్పి వస్తూ ఉంటుంది ఇలా ఉదయం లేచిన వెంటనే తలనొప్పి రావడానికి కారణం లేకపోలేదు.

    early-morning-headaches-causes-and-treatments
    early-morning-headaches-causes-and-treatments

    మనం రాత్రి పడుకునే సమయంలో తక్కువగా నీటిని తాగటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి అవుతుంది. ఇలా డిహైడ్రేషన్ కి గురైనప్పుడు మనకు ఉదయం లేవగానే తలనొప్పి వస్తుంది. అదేవిధంగా సరైన నిద్ర లేకపోవడం స్లీప్ అప్నియాతో బాధపడే వారిలో కూడా ఈ విధమైనటువంటి తలనొప్పి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఒక వారం నైట్ షిఫ్ట్ మరొక వారం డే షిఫ్ట్ చేసే వారిలో కూడా ఇలాంటి సమస్య తరచూ వస్తూ ఉంటుంది.

    ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఉదయం లేవగానే తలనొప్పి వస్తే వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది. అదేవిధంగా రాత్రి వేళ కెఫిన్ ఉన్న టీ, కాఫీ, చాక్లెట్లు వంటివి కాకుండా ఒక గ్లాసు నీరు తాగి పడుకోండి. రాత్రంతా టీవీలు, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లు చూసి నిద్రించే అలవాటును తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చెయ్యాలి. తలనొప్పితో పాటు వాంతులు వికారంగా అనిపిస్తే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో మంచిది.