Mangala suthram : మహిళకు వివాహమైన తర్వాత మెడలో మంగళసూత్రం వారికి మరింత రెట్టింపు అందాన్ని ఇస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా మెడలో మంగళసూత్రం ఉండాలని మహిళ మెడలో మంగళసూత్రం భర్త ఆయుష్షుకు క్షేమం కలిగిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఫ్యాషన్ మాయలో పడి మంగళసూత్రం తొలగించి కేవలం చిన్నటి నల్లపూసల దండలు మాత్రమే వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇలా మంగళసూత్రం పక్కన తీసేయడం భర్త ఆయుష్షుకు ప్రమాదకరంగా మారుతుందని పండితులు చెబుతున్నారు.
ఇక మంగళసూత్రం ధరించే విషయంలో కూడా చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు మంగళ సూత్రం ఎప్పుడు కూడా మహిళ గుండెపై కాకుండా వక్షస్థలం కింది వరకు ఉండాలి. ఇక ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తర్వాత సౌభాగ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి పసుపు కుంకుమలను మంగళసూత్రానికి రాసుకోవాలి. అలాగే మంగళసూత్రానికి ఎప్పుడు కూడా పిన్నిసులు వేయకూడదు.
ఇలా ఇనుమును మంగళసూత్రానికి వేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. తద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుందని ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయని పండితులు చెబుతుంటారు. ఇకపోతే భార్య ఎప్పుడూ కూడా తన మంగళసూత్రం భర్తకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ కనిపించేలాగా వేసుకోకూడదు ఒక మహిళ మంగళసూత్రాన్ని కేవలం తన భర్త మాత్రమే చూడాలి. ఇక మంగళసూత్రం ఎలాంటి పరిస్థితులలో కూడా మెడలో నుంచి తీసివేయటం మంచిది కాదు.