Devotional Facts: సాధారణంగా మహిళలకు ఎక్కువ భక్తి భావం అనే సంగతి మనకు తెలిసిందే. మహిళలు ఎక్కువగా పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు నోములు చేసేటటువంటి వారు పెళ్లి తర్వాత కూడా పెద్ద ఎత్తున నోములు చేస్తూ ఉంటారు అయితే భర్త చనిపోయినటువంటి మహిళలు ఈ పూజలు వ్రతాలు నోములు చేయవచ్చా.. ఇలాంటివారు పూజలు చేసే విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే…
శాస్త్రం ప్రకారం మహిళలు ఎన్ని రకాల పూజలు అయినా కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా భర్త లేనటువంటి మహిళలు కూడా పూజలు నోములు చేసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. భర్త లేనటువంటి వారు ఇలాంటి పూజలు చేయకూడదని నియమాలు ఎక్కడ లేవని పండితులు చెబుతున్నారు. అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి పీటలపై కూర్చొని చేయాల్సిన పూజలు మినహా మిగిలిన ఏ పూజలైనా కూడా మహిళలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
సత్యనారాయణ వ్రతం గృహప్రవేశ కార్యక్రమాలు ఇలా కొన్ని పూజ కార్యక్రమాలు తప్పనిసరిగా దంపతులు చేయాల్సి ఉంటుంది మిగిలిన పూజా కార్యక్రమాలను నోములను వితంతువులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇలా పూజలు చేయడానికి భర్త ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదని వారు భగవంతుడిని స్మరించడం కోసమే ఇలాంటి పూజలు చేస్తున్నారు కనుక పూజలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు.